Don't Miss!
- News
సీఎం జగన్ -కోటంరెడ్డి మధ్య ఏం జరిగింది : గ్యాప్ మొదలైంది అక్కడేనా..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
The WARRIORR 10 Days Collections: శనివారం కూడా వారియర్‌కు షాకే.. ఇంకెన్ని కోట్లు రావాలో తెలిస్తే!
టీనేజ్‌లోనే హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. నటనకు నటన, డ్యాన్స్‌కు డ్యాన్స్, స్టైల్స్‌కు స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ ప్రేక్షకులను మెప్పిస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకుపోతోన్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ 'ఇస్మార్ట్ శంకర్'తో రామ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'రెడ్'తో ఇంకో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ది వారియర్' అనే సినిమాను చేశాడు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో కొన్ని రోజుల క్రితమే విడుదలైన దీనికి భారీ దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో వారియర్ 10 రోజుల్లో ఎంత వసూలు చేశాడో మీరే చూడండి!

ది వారియర్‌గా రామ్ అరాచకం
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ తెరకెక్కించిన సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అయింది.
తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

ది వారియర్ బిజినెస్ వివరాలివే
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది వారియర్' మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
10వ రోజు 'ది వారియర్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు కాస్త పెరిగాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 33 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.
పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

10 రోజులకు కలిసి ఎంత వచ్చింది?
'ది వారియర్' ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.07 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.39 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.33 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.16 కోట్లు, గుంటూరులో రూ. 1.94 కోట్లు, కృష్ణాలో రూ. 94 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో కలిపి రూ. 17.19 కోట్లు షేర్, రూ. 26.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.19 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 67 లక్షలు, తమిళంలో రూ. 1.25 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 10 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.16 కోట్లు షేర్, రూ. 34.40 కోట్ల గ్రాస్ వచ్చింది.
స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రామ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో రూ. 20.16 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 18.84 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.