»   »  ఇక అన్నీ లాభాలే: రంగస్థలం ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

ఇక అన్నీ లాభాలే: రంగస్థలం ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangasthalam First Week Collections

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ బాక్సాఫీసు వద్ద గురువారంతో విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది.

రామ్ చరణ్ కెరీర్లో ఈ మధ్య కాలంలో హిట్స్ ఉన్నాయే తప్ప... బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. 2009లో చరణ్ నటించిన మగధీర తర్వాత ఆ స్థాయిలో బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా అతడి ఖాతాలో పడలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చరణ్ అభిమానులు పూర్తిస్థాయి సంతృప్తి చెందే సినిమా 'రంగస్థలం' రూపంలో వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఆశ్చర్యపరిచే కలెక్షన్లు

ఆశ్చర్యపరిచే కలెక్షన్లు

సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ క్రియేట్ కావడం, విడుదల తర్వాత సూపర్ అంటూ స్ట్రాంగ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో తొలి 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

తొలివారం

తొలివారం

ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్‌లో కలెక్షన్ల జోరు తగ్గుతుందని అనుకున్నప్పటికీ అలా జరుగకుండా మంచి వసూళ్లతో సినిమా తీసుకెళుతోంది. తొలి వారం(7డేస్) పూర్తయ్యే నాటికి ఈ చిత్రం రూ. 130 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 81 కోట్ల డిస్ట్రిబ్రూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

లాభాల బాటలోకి

లాభాల బాటలోకి

ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్ రూ. 80 కోట్లకు అమ్మారు. ఆల్రెడీ రూ. 81 కోట్ల షేర్ రావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింటును దాటి లాభాల బాటలోకి వచ్చింది. ఇకపై ఈ చిత్రానికి వచ్చే వసూళ్లన్నీ లాభాలే.

ఎదురులేని రంగస్థలం

ఎదురులేని రంగస్థలం

ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద నితిన్ ‘ఛల్ మోహన్ రంగ'తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇవేవీ ‘రంగస్థలం' చిత్రానికి పోటీ ఇచ్చే పరిస్థితిలో లేవు. దీంతో సెకండ్ వీక్ ‘రంగస్థలం' డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు జేబులో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

పైపైకి ఎగబాకుతూ టాప్‌లోకి

పైపైకి ఎగబాకుతూ టాప్‌లోకి

మరో వైపు టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాస్ కలెక్షన్ల లిస్టులో ఒక్కో సినిమాను వెనక్కి నెట్టుతూ రంగస్థలం పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే డిజే, సరైనోడు గ్రాస్ రికార్డులను ‘రంగస్థలం' అధిగమించింది. సెకండ్ వీక్ పూర్తయ్యే నాటికి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, జై లవ కుశ చిత్రాలను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Rangasthalam has collected approximately over Rs 130 crore gross at the worldwide box office in the first week. In seven days, the Ram Charan and Samantha Akkineni starrer has earned Rs 81 crore for its global distributors, who had invested Rs 80 crore for its theatrical rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X