ఫస్ట్ వీకెండ్ అదుర్స్
రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధికంగా 194 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం తొలి వీకెండ్ పూర్తయ్యే నాటికి $1,939,890 వసూళ్లు నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే చెర్రీ గత చిత్రం ‘ధృవ' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ప్రీమియర్ షోల ద్వారా గురువారం $706,612, శుక్రవారం $588,165, శనివారం $645,114 , ఆదివారం $426,685 వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.
వీక్ డేస్ కాస్త వీక్
వారాంతం సెలవుల కారణంగా కలెక్షన్ల జోరు ప్రదర్శించిన ‘రంగస్థలం'..... సోమవారం వర్కింగ్ డే కారవడం, స్క్రీన్ల సంఖ్య కూడా తగ్గడంతో వసూల్లు తగ్గాయి. సోమవారం ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $109,000 వసూలు చేసింది. దీంతో టోటల్ గ్రాస్ $2,479,213 నమోదైంది.
ప్రస్తుతం 4వ స్థానంలో
తొలి 4 రోజుల్లోనే ‘రంగస్థలం' మూవీ ‘అ...ఆ'($2,449,000), ఖైదీ నెం 150($2,447,000) లైఫ్ టైమ్ రికార్డులను అధిగమించింది. బాహుబలి, బాహుబలి 2, శ్రీమంతుడు తర్వాత ‘రంగస్థలం' అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా నిలిచింది.
శ్రీమంతుడు రికార్డును దాటి 3 మిలియన్ మార్క్ దిశగా
యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 5వ రోజు(మంగళవారం) కలెక్షన్లతో కలుపుకుని ఓవరాల్ వసూళ్లు $2,571,213 రీచ్ అయింది. త్వరలోనే ఈ చిత్రం శ్రీమంతుడు ($2,891,000) రికార్డును అధిగమిస్తుందని, లైఫ్‌టైమ్ రన్‌లో 3 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.