»   »  ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్: ఇదీ ‘రంగస్థలం’ పొజిషన్, తండ్రి రికార్డుపైనే కన్ను!

ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్: ఇదీ ‘రంగస్థలం’ పొజిషన్, తండ్రి రికార్డుపైనే కన్ను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. బుధవారంతో బాక్సాఫీసు వద్ద 6 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 121 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ 10 ఆల్ టైమ్ గ్రాస్ లిస్టులో చోటు దక్కించుకుంది. అయితే మెగా అభిమానులంతా ఈ చిత్రం మరో లెవల్‌కి వెళుతుందని అంచనా వేస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు అని రామ్ చరణ్ పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Rangasthalam Beats Khaidi No.150 In Its First Weekend
డిజే రికార్డులు బద్దలు

డిజే రికార్డులు బద్దలు

అల్లు అర్జున్ మూవీ ‘డిజే' ఫుల్ రన్‌లో వరల్డ్ వైడ్ రూ. 115 కోట్ల గ్రాస్ సాధించిన ఇప్పటి వరకు 10వ స్థానంలోఉండగా.... కేవలం 6 రోజుల్లోనే ‘రంగస్థలం' చిత్రం రూ. 121 కోట్లు వసూలు చేసి దాన్ని అధిగమించింది.


మరో నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు

మరో నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు

ప్రస్తుతం రంగస్థలం చిత్రానికి వస్తున్న కలెక్షన్ల జోరు చూస్తుంటే మరో 4 రోజుల్లో రూ. 150 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే మగధీర, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, జై లవ కుశ, సరైనోడు చిత్రాల రికార్డులన్నీ బద్దలు కానున్నాయి.


 టాప్ 3 మూవీస్ ఇవే

టాప్ 3 మూవీస్ ఇవే

టాలీవుడ్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 మూవీ రూ. 1706.50 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ. 600 కోట్ల వసూళ్లతో బాహుబలి రెండో స్థానంలో ఉంది. రూ. 164 కోట్ల వసూళ్లతో ‘ఖైదీ నెం 150' చిత్రం మూడో స్థానంలో ఉంది.


తండ్రి రికార్డును తనయుడు అధిగమిస్తాడా?

తండ్రి రికార్డును తనయుడు అధిగమిస్తాడా?

రంగస్థలం చిత్రం రూ. 150 కోట్ల మార్కును అధిగమిస్తే టాలీవుడ్లో టాప్ 4వ గ్రాసర్‌గా ‘రంగస్థలం' మూవీ రికార్డుల కెక్కనుంది. అయితే మెగాస్టార్ ఖైదీ నెం 150 రికార్డును టచ్ చేస్తుందా? లేదా? అనేది వచ్చే వారానికికానీ అంచనా వేయలేం.


 టాలీవుడ్ టాప్ 10 గ్రాస్

టాలీవుడ్ టాప్ 10 గ్రాస్

1. బాహుబలి 2 రూ. 1706.50 కోట్లు, 2. బాహుబలి రూ. 600 కోట్లు), 3. ఖైదీ నెం 150 రూ. 164 కోట్లు, 4. మగధీర రూ. 150 కోట్లు, 5. శ్రీమంతుడు రూ. 144.55 కోట్లు, 6. జనతాగ్యారేజ్ రూ. 134.80 కోట్లు, 7. అత్తారింటికి దారేది రూ. 131 కోట్లు, 8. జై లవ కుశ రూ. 130.90 కోట్లు, 9. సరైనోడు127 కోట్లు, 10. రంగస్థలం రూ. 121 కోట్లు.


English summary
As per the estimates, Rangasthalam collected approximately Rs 121 crore gross at the worldwide box office in six days and beaten lifetime record of Allu Arjun's DJ aka Duvvada Jagannadham. Rangasthalam Eye on Khaidi No 150 record.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X