»   » వరుసబెట్టి ఊడ్చేస్తున్న చిట్టిబాబు.. శ్రీమంతుడు రికార్డ్ బ్రేక్!

వరుసబెట్టి ఊడ్చేస్తున్న చిట్టిబాబు.. శ్రీమంతుడు రికార్డ్ బ్రేక్!

Subscribe to Filmibeat Telugu

రంగస్థలం చిత్రంతో రాంచరణ్ నయా రికార్డులు సృష్టిస్తున్నాడు. పాత రికార్డులన్నింటిని ఊడ్చేస్తున్న రంగస్థలం చిత్రం బాహుబలి చిత్రం తరువాత స్థానాన్ని ఆక్రమిస్తోంది. అన్ని ఏరియాలలో రంగస్థలం చిత్రానికి అద్భుతమైన కలెక్షన్లు నమోదవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రాంచరణ్ అద్భుత నటన, సమంత, ఆదిపినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ ఈ చిత్ర ఘనవిజయాన్ని దోహద పడిన అంశాలు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినీకాకు కావలసినంత హిప్ క్రియేట్ చేయడంలో ఉపయోగపడింది. దేవి శ్రీ అందించిన బాణీలు ఉర్రూతలూగిస్తున్నాయి. కాగా రంగస్థలం చిత్ర హవా యుఎస్ లో కొనసాగుతోంది. 3 మిలియన్ డాలర్ మార్క్ వైపు రంగస్థలం చిత్రం పరుగులు పెడుతోంది.

Rangastham movie breaks Srimanthudu record

మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది. రంగస్థలం చిత్రం ఆ రికార్డుని బ్రేక్ చేసి మూడు మిలియన్ల దిశగా జైత్ర యాత్ర కొనసాగిస్తున్నట్లు సమాచారం. రంగస్థలం చిత్రం హవాకు ఖైదీ, అజ్ఞాతవాసి వంటి చిత్రాల రికార్డులని తుడిచిపెట్టుకుపోయాయి. తాజాగా ఈ చిత్రం శ్రీమంతుడు రికార్డుని కూడా అధికమించింది.

English summary
Rangastham movie breaks Srimanthudu record. Ram Charan creates non Bahubali record
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X