Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka 11 Days Collections: 100 కోట్లతో మాస్ కుమ్ముడు.. రవితేజ రేర్ బాక్సాఫీస్ ఫీట్!
మాస్ మహారాజ రవితేజ పర్ఫెక్ట్ మాస్ సినిమాతో వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ అవుతాయో ధమాకా సినిమాతో మరోసారి నిరూపించాడు. త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా 10 రోజులైనా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ అందుకుంటోంది. ఇక ఆదివారం తర్వాత సోమవారం రోజు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక 11వ రోజు ఎంత వచ్చాయి. అలాగే ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్
మాస్ హీరో రవితేజకు ధమాకా సినిమాపై డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ చేసింది. ఇక ఏరియాల వారిగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో మొత్తంగా ధమాకా రూ. 18.30 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

11వ రోజు కలెక్షన్స్ ఎంత..
'ధమాకా' సినిమా 11వ రోజు ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్స్ అందుకుంది. నైజాంలో రూ. 81 లక్షలు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.63 కోట్లు షేర్, రూ. 3 కోట్లు గ్రాస్ వసూలైంది.

11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్
11 రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 14.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.83 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.83 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.11 కోట్లు, గుంటూరులో రూ. 1.59 కోట్లు, కృష్ణాలో రూ. 1.51 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో మొత్తంగా రూ. 30.90 కోట్లు షేర్, రూ. 56.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
'ధమాకా' సినిమా ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 30.90 కోట్లు షేర్ వచ్చింది. ఇక ఈ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.97 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.30 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకుంటే 11 రోజుల్లో ధమాకా రూ. 36.17 కోట్లు షేర్‌తో పాటు రూ. 68.17 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది. అయితే చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా 94 కోట్లు గ్రాస్ వచ్చినట్లు ఒక పోస్టర్ అయితే విడుదల చేసింది.

ధమాకా తెచ్చిన ప్రాఫిట్స్ ఎంతంటే?
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ధమాకా' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక 11 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 36.17 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.17 కోట్లు లాభాలు వచ్చాయి.