For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhamaka: రికార్డు స్థాయిలో రాబోతున్న ధమాకా.. రవితేజ కెరీర్‌లోనే గొప్పగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గత ఏడాది 'క్రాక్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ సంవత్సరం మాత్రం ఈ మాస్ హీరో వరుసగా 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి భారీ డిజాస్టర్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో రవితేజ 'ధమాకా' అనే సినిమాలో నటించాడు.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'ధమాకా'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ మూవీని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముగించుకుంది. ఇక, నేటి సాయంత్రం నుంచి యూఎస్‌లో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి.

  Ravi Teja Dhamaka Movie Worldwide Total Theaters Count

  'ధమాకా' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 228, సీడెడ్‌లో 160, ఆంధ్రాలో 280 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 670 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 70, ఓవర్సీస్‌లో 200 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 940 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా రవితేజ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

  Ravi Teja Dhamaka Movie Worldwide Total Theaters Count

  ఇదిలా ఉండగా.. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన 'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి, చిరాగ్ జైన్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు చేశారు.

  English summary
  Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. Now Lets Know about This Movie Total Theaters Count.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X