»   »  ట్రేడ్ టాక్ 'రెడీ' టాప్

ట్రేడ్ టాక్ 'రెడీ' టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ready
గడిచిన వారం మూడు సినిమాలు (గోరింటాకు, అదే నవ్వు, అప్పు చేసి పప్పు కూడు) రిలీజయ్యాయి. అయితే మూడూ ఊహించని విధంగా భాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడం విశేషం. కన్నడ సినిమా 'అన్న తంగి' ఆధారంగా వచ్చిన 'గోరింటాక్' పూర్ టాక్ తెచ్చుకోవటానికి శృతి మించిన ఓవర్ ఎమోషన్స్ ఉండటమేనని...అలాగే టేకింగ్ దూరదర్శన్ సీరియల్ ని తలపిస్తోందని అంటున్నారు.

ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'అప్పు చేసి పప్పు కూడు' బాగా...ఓల్డ్ అని తేల్చి పారేశారు. ఎప్పుడో రేలంగినరసింహరావు చుట్టిపారేసిన రీళ్ళు ఇన్నాళ్ళకు మోక్షం లభించి ప్రేక్షకులని బలి చేస్తున్నాయని ట్రేడ్ రిపోర్టు. ఇక 'అదే నవ్వు'...సాయికిరణ్ చేసిన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయినట్లు యూనిట్ సభ్యులకు మాత్రమే తెలుసు.

రామ్, జెనీలియా, శ్రీను వైట్లు తాజా చిత్రం 'రెడీ' టాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. తొలివారంలోనే 100 శాతం కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం...రెండో వారంలో సైతం భారీ కలెక్షన్లు సాధించింది. పలు చోట్లా ఈ వినోద చిత్రం కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది.

కమల్ హాసన్ తాజా చిత్రం 'దశావతారం' రెండో చిత్రంలో నిలుస్తోంది. కథకథనాలు బలహీనంగా ఉన్నా...సాంకేతిక విలువలు బలంగా ఉండడం, కమల్ హాసన్ పది అవతారాల్లో అలరిస్తుండడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. పట్టణ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X