For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ ‘రెబల్' బిజినెస్ పొజీషన్

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. రీసెంట్ గా ఆడియో విడుదలైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా స్పీడుగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రబాస్ మార్కెట్ ని దాటి రికార్డు స్ధాయిలో ఈ చిత్రానికి బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అంతేగాక తమిళనాడులో సైతం ఈ చిత్రం బిజినెస్ మంచి ఊపుమీద ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రికార్డు స్ధాయిలో తమిళనాడు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. లారెన్స్ కి తమిళనాట మార్కెట్ ఉండటం అక్కడ బిజినెస్ కి ప్లస్ అయ్యిందని తెలుస్తోంది.

  ఇక దిల్ రాజు ఈ చిత్రం నైజాం రైట్స్ ని తొమ్మిది కోట్లు ఇచ్చి తీసుకున్నాడని,మొత్తం ముప్పై కోట్లు వరకూ బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా ఐదు కోట్ల యాభై లక్షలు వరకూ వచ్చాయని అంటున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక అటుంవంటిదేమీ జరగదని,సెప్టెంబర్ 28న ఖచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత తెలియచేసారు. ఈ సినిమాకు లారెన్స్ సంగీతం అందిచారు.

  ఈ రెబెల్ చిత్రంలో కృష్ణంరాజు ఓ కీలకమైన రోల్ చేస్తున్నారు. కథని మలుపుతిప్పే ఈ పాత్ర కోసమే సినిమా నడుస్తుందని చెప్తున్నారు. లారెన్స్ మాట్లాడుతూ... మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు.

  అలాగే ప్రభాస్‌ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనేది టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది.ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది అన్నారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  Prabhas market is touching record heights with Rebel. The pre-release business for Rebel has been stunning with distribution rights being sold out for fancy prices across the world. Dil Raju has bought the rights of Rebel for the Nizam area for a whopping 9 Crores. Rebel is made lavishly with a high budget of over 35 Crores which is highest till date in Prabhas career. Rebel is set for a worldwide release on September 28.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X