For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'రెబల్' బిజినెస్ ఏ ఏరియా..ఎంతెంత?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోందీ సినిమా. ఆడియో వీక్ అని టాక్ వచ్చినా ట్రేడ్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం బిజెనెస్ పరంగా కూడా నిర్మాతలకు ఆనందాన్ని కలిగించిందని ట్రేడ్ టాక్. బడ్జెట్ ఎక్కువనా దానికి తగినట్లు బిజినెస్ జరగటంతో దర్శక,నిర్మాతలు హ్యపీగా ఉన్నట్లు చెప్తున్నారు. అందులోనూ చిత్రం ఛత్రపతిని దాటే చిత్రం అవుతుందని పబ్లిసిటీ చేయటం కూడా కలిసి వచ్చిన అంశం.

  ఈ చిత్రం బిజినెస్ ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలను బట్టి...

  నైజాం రైట్స్ ని దిల్ రాజు ...9 కోట్లు కు తీసుకున్నారు.

  బెల్లంకొండ సురేష్ ..వైజాగ్ ఏరియా... 3.6 కోట్లుకు తీసుకున్నారు.

  ఎన్.వి ప్రసాద్, బళ్లారి సాయి కలిసి సీడెడ్ ఏరియాను..5.75 కోట్లకు తీసుకున్నారు.

  14 రీల్స్ వారు కృష్ణా ఏరియాకు 2.25 కూ తీసుకున్నారు.

  తమిళనాడు ఏరియాను..33 లక్షలు కు అమ్ముడైంది.

  7 సీస్ ఫారెన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకే తీసుకున్నట్లు సమాచారం.
  ఇక ఈ చిత్రంలో తాను చెప్పే...''ప్రతివాడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు... బై బర్త్ అది బ్లడ్‌లో ఉండాలి'' డైలాగు హైలెట్ అని ప్రబాస్ చెప్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో తాను హీరోగా రూపొందిన 'రెబల్' చిత్రంలో ఇలాంటి శక్తివంతమైన డైలాగులు చాలా ఉన్నాయంటున్నారు ప్రభాస్. వరసగా ప్రేమకథా చిత్రాల్లో నటించిన తనకు ఈ మాస్ మూవీ చాలా కిక్ ఇచ్చిందని, తన పాత్ర మాస్ అని చెప్పారు.

  ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా 'రెబల్‌'. తమన్నా, దీక్షాసేథ్‌ కథానాయికలు. రాఘవ లారెన్స్‌ దర్శకుడు. శ్రీ బాలాజీ సినీ మీడి యా పతాకంపెై జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మించారు. ఈ విషయం ఖరారు చేయటానికి నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇచ్చిన సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీసాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  Prabhas fans are eagerly waiting to see their hero as Rebel at big screen on 28th Sep 2012. Tamannaah and Deeeksha Seth have played the female leads. Raghava Lawrence, who directed the movie, has also scored the music for this mass entertainer. Rebel, which is currently in post-production stage, is jointly produced by J Bhagawan and J Pulla Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X