వర్మ 'అప్పల్రాజు' 32 నిముషాలు కట్ చేసాక..రిజల్ట్ ఏమిటి?
సునీల్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొంది విడుదలైన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ సెటిల్ అయింది. ఈ చిత్రం ప్లాప్ టాక్ రావటంతో దాదాపు 32 నిముషాల సేపు కట్ చేసి 2 గంటల 41 నిముషాల సినిమాని 2 గంటల తొమ్మిది నిముషాలకు కుదించారు. అయినా ఎక్కడా రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. 12 సంవత్సరాల తర్వాత వర్మ రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ పై సెటైర్స్ తో రూపొందింది. అయితే ఆ సైటైర్స్ సిని పరిశ్రమకు చెందినవారిపై కావటంతో సామాన్య ప్రేక్షకులకు అవి అర్దం కాక ఎవరూ ఐడింటిఫై చేసుకోలేకపోయారని అదే ప్లాపుకు కారణమని చెప్తున్నారు. అయితే వర్మ ఈ చిత్ర పరాజయాలతో సంభందం లేకుండా తన తదుపరి చిత్రం దొంగలముఠా పై కాన్సర్టేట్ చేసాడని వినపడుతోంది.
రామ్ గోపాల్ వర్మ స్వాతి అప్పల్రాజు సునీల్ మర్యాద రామన్న ram gopal varma swathi appalaraju sunil maryada ramanna


Click it and Unblock the Notifications