»   » టైమ్ చూసి కొడుతున్నారు...టాక్ వస్తే సూపర్ హిట్టే

టైమ్ చూసి కొడుతున్నారు...టాక్ వస్తే సూపర్ హిట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : ప్రస్తుతం థియోటర్స్ అన్నీ ఓ సూపర్ హిట్ చిత్రం కోసం ఆశగ ఎదురుచూస్తున్నాయి. మనం చిత్రం తర్వాత ఊహలు గుసగుస లాడే చిత్రం మాత్రమే యావరే్ టాక్ తో రన్ అవుతోంది. బావురుమంటున్న థియోటర్స్ కు సరైన ఫీడింగ్ ఇచ్చే సినిమా కావాలి. ఈ ఫెరఫెక్ట్ టైమ్ లో ఓ మాదిరి టాక్ వచ్చినా సినిమా నిలబెట్టి సూపర్ హిట్ కొట్టేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి టైమ్ లో రారా కృష్ణయ్య విడుదల అవుతోంది. ఏ పోటీ లేకుండా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చినా బ్రహ్మరధం పట్టే అవకాసం ఉంది. మరి సినిమాలో ఏ మాత్రం సీన్ ఉందో చూడాలి.

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలై 4 న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. జగపతిబాబు ఈ చిత్రంలో హీరో అన్నగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు.

Right time to Sundeep’s Ra Ra Krishnayya

నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఉంటుంది. లక్ష్యం సినిమాలో గోపిచంద్ అన్నగా నటించిన జగపతిబాబు మళ్ళీ ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన కమిట్ అయిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలస్తుంది అన్నారు.

సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ... ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. జగపతిబాబు, అల్లరి రవిబాబు, తనికెళ్ళ భరణి,బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ , నల్లవేణు, సత్యం రాజేష్, శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు.


English summary
Sundeep Kishan and Regina are acting as the lead actors in ‘Ra Ra Krishnayya’ and this movie is being readied for a possible release on July 4th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu