కాంతార చాప్టర్ 1 ప్రభంజనం.. బుక్ మై షోలో రిషబ్ శెట్టి మూవీ సరికొత్త చరిత్ర?
రిషబ్ శెట్టి దర్శకత్వంలో గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా తాజాగా తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 4500 థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజైంది. కాంతారకు ప్రీక్వెల్ కావడంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్లుగానే కాంతార చాప్టర్ 1 అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన కాంతార చాప్టర్ 1.. టికెట్ బుకింగ్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కాంతార బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మించారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.

ప్రీ సేల్స్‌లో కాంతార క్రేజ్
కాంతార చాప్టర్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ కోసం అక్కడి ప్రేక్షకులు ఎగబడ్డారు. ప్రీ సేల్స్ పరంగా ఒక్కో సినిమా రికార్డులను అధిగమించింది. ఇండియాలో ప్రీ సేల్స్ పరంగా ఈ ఏడాది 6వ స్థానంలో ఉన్న అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రికార్డును అధిగమించింది కాంతార చాప్టర్ 1. సాక్‌నిక్ డేటా ప్రకారం.. ఇండియాలో ప్రీ సేల్స్‌లో 19.44 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది కాంతార. కన్నడ వెర్షన్‌లో ప్రీ సేల్స్‌పరంగా 9.9 కోట్ల రూపాయలను ఒక్క అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అదుకుంది.
ప్రీ సేల్స్‌లో టాప్ ఓజీ
2025లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్స్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్‌లో ఓజీ (65 కోట్ల రూపాయలు) నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత కాంతార చాప్టర్ 1 కంటే ముందు కూలీ (37.3 కోట్ల రూపాయలు), హరిహర వీరమల్లు (35 కోట్ల రూపాయలు), గేమ్ ఛేంజర్ (31.80 కోట్ల రూపాయలు), వార్ 2 (21 కోట్ల రూపాయలు) ఉన్నాయి.
బుక్ మై షోలో కాంతార చాప్టర్ 1 రికార్డులు
ప్రీ సేల్స్‌లోనే కాదు తొలి రోజు టికెట్ బుకింగ్స్‌లోనూ రిషబ్ శెట్టి మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం నాటికి బుక్ మై షోలో అవర్లీ టికెట్ సేల్స్ 82.6కే వద్ద ఉండగా.. ఫస్ట్ షో, సెకండ్ షో.. అక్టోబర్ 3వ తేదీ (రెండో రోజు) ఉదయం 8 గంటల వరకు ఏకంగా 2 మిలియన్‌లకు పైగా టికెట్లు బుక్ అయినట్లుగా బుక్ మై షో వెల్లడించింది. కాంతార చాప్టర్ 1 దూకుడు చూస్తుంటే కేజీఎఫ్ 2 రికార్డులను బద్ధలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటూ రిషబ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు రిషబ్ శెట్టి మూవీ వరల్డ్ వైడ్‌గా 90 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











