»   » 'ఊసరవెల్లి' చిత్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు

'ఊసరవెల్లి' చిత్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ యన్.టి.ఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊసరవెల్లి'చిత్రం మార్కెట్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎందరో పెద్ద మొత్తాలతో ప్రయత్నించినప్పటికీ ఆ పోటీని ఎదుర్కొని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఆంద్ర దేశమంతటా విడుదల చేయటానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పంపిణి హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.వరసగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఎదుగుతున్న ఈ సంస్ధ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా వచ్చి ఇలా ఓ పెద్ద సినిమా రైట్స్ తీసుకోవటడం ఎవరూ ఊహించని పరిణామం.

ఇక ఈ మద్యనే నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' సినిమా డిస్త్రిబ్యుషన్ హక్కులను కైవశం చేసుకుంది.ప్రస్తుతం 'ఊసరవెల్లి' కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

English summary
RR Movie Makers was in the news earlier, for acquiring AP Distribution rights of Nagarjuna Starrer upcoming film ‘Rajanna’. Now, RR Movie makers have also acquired the Distrubution rights of Jr. NTR starrer, ‘Oosaravelli’, Directed by Surender Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu