Don't Miss!
- News
రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ: మోడీకి వినతి
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Lifestyle
ఈ గుణాలున్న పురుషులు మంచి భాగస్వామి కాలేరు, అవేంటంటే..
- Sports
ICC Men's T20I Team of the Year 2022: భారత్ నుంచి ముగ్గురే.. రోహిత్‌కు దక్కని చోటు!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
RRR 45 Days Collections: మూవీకి కలిసొచ్చిన సండే.. ఒక్కరోజే అన్ని లక్షలు.. ఓవరాల్ కలెక్షన్లు చూస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతూ.. 'బాహుబలి' పాన్ ఇండియా రేంజ్‌లో పేరు సంపాదించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని కూడా అమాంతం పెంచేసిన ఆయన.. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అనుకున్న రీతిలోనే స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు, ఏకంగా ఆరు వారాల పాటు మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ నేపథ్యంలో RRR మూవీకి 45 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా వచ్చేసిన RRR
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా నటించారు.
Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
పట్టాలపై ఉన్న సమయంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న RRR మూవీ హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు లెక్క.

45వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అందుకే ఇది వారంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం తగ్గుతూ వస్తోంది. కానీ, వీకెండ్స్‌లో పుంజుకుంటూ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 45వ రోజైన ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి రూ. 32 లక్షలు షేర్ వచ్చింది.
Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

45 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 45 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.29 కోట్లు, గుంటూరులో రూ. 18.11 కోట్లు, కృష్ణాలో రూ. 14.66 కోట్లు, నెల్లూరులో రూ. 9.34 కోట్లతో కలుపుకుని రూ. 269.26 కోట్లు షేర్, రూ. 407.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో RRR 45 రోజుల్లో రూ. 269.26 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.35 కోట్లు, తమిళనాడులో రూ. 38.54 కోట్లు, కేరళలో రూ. 10.65 కోట్లు, హిందీలో రూ. 133.26 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 45 రోజుల్లోనే రూ. 607.50 కోట్లు షేర్, రూ. 1131.10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 45 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 607.50 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 154.50 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.