Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
RRR Hindi 8th day collections..రజనీకాంత్ రికార్డు బ్రేక్.. హిందీలో కలెక్షన్ల దుమారం
సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. భాష, ప్రాంత, దేశం అనే తేడా లేకుండా వసూళ్లు వర్షాన్ని కురిపిస్తున్నది. రెండోవారంలోకి ప్రవేశించినా కలెక్షన్ల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియాభట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. 8వ రోజున హిందీ బాక్సాఫీస్ వద్ద RRR సాధించిన కలెక్షన్ల వివరాలు ఎంతంటే..

హిందీలో టాప్ డబ్బింగ్ మూవీ కలెక్షన్లు
హిందీలో దక్షిణాది భాషల డబ్బింగ్ చిత్రాలకు సంబంధించిన భారీ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాహుబలి 247 కోట్ల నికర వసూళ్లను సాధించి టాప్‌లో ఉండగా. 2.0 చిత్రం 133 కోట్లు, RRR ప్రస్తుతం 132.82 కోట్లు, సాహో 116 కోట్లు, బాహుబలి 46.77 కోట్లు వసూలు చేసింది. పాండమిక్ సమయంలో పుష్ప 27 కోట్లు రాబట్టింది.

RRR మూవీ తొలివారంలో
ఇక మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలి వారంలోనే 133 కోట్ల గ్రాస్ వసూళ్లను రికార్డు చేసింది. కరోనా పాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా RRR ఘనతను సాధించింది. ప్రస్తుతం వారంలో కూడా ఘనమైన కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది. హిందీలో RRRను ఎదురించే సినిమా లేకపోవడంతో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

వారం రోజుల RRR కలెక్షన్లు
RRR హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజున 20 కోట్లకుపైగా, రెండో రోజున 24 కోట్లు, మూడో రోజున 31.5 కోట్లు, నాలుగో ర రోజున 17 కోట్లు, ఐదో రోజున 15.25 కోట్లు, ఆరో రోజున 13.5 కోట్లు, ఏడో రోజున 11.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్ర్ తొలి వారంలో 132.82 కోట్లు రాబట్టింది. 9వ రోజున రజనీకాంత్ నటించిన 2.0 సినిమా వసూళ్లను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

RRR 8వ రోజు కలెక్షన్లు
RRR చిత్రం హిందీ వెర్షన్ రెండో వారంలోకి ప్రవేశించింది. రెండో శుక్రవారం కూడా ఈ సినిమా వసూళ్లు ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. గురువారం సాధించిన కలెక్షన్లకు సమానంగా ఈ సినిమా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం సుమారు 11 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండో వారంలో కనీసం 40 కోట్లు సాధించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా సూపర్ హిట్ అని ట్రేడ్ అనలిస్టు సుమిత్ కడేల్ ట్వీట్ చేశారు.
Recommended Video


RRR లాభాల్లోకి రావాలంటే?
RRR హిందీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 190 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం 132.82 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 57 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. రెండో వారంలో ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.