»   »  ‘రుద్రమ దేవి’ ఫైనల్ రిజల్ట్ ఏమిటి?

‘రుద్రమ దేవి’ ఫైనల్ రిజల్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక మూవీ ‘రుద్రమదేవి' ఫైనల్ రిజల్ట్ ఏమిటనే విషయమై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. ఈ సినిమా కోసం గుణశేఖర్ పడ్డ కష్టాన్ని చూసి అంతా ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవరాల్ గా రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందు రూ. 50 కోట్ల మేర షేర్ వచ్చినట్లు టాక్. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 50 గ్రాస్, రూ. 30 కోట్లకు అటూ ఇటుగా షేర్ సాధించినట్లు సమాచారం.


Rudramadevi movie final result

రుద్రమదేవి మూవీ మిక్ట్స్ టాక్ లోనూ రూ. 50 కోట్ల షేర్ సాధించడం విశేషం. అయితే బడ్జెట్ రూ. 70 కోట్లు కావడంతో నష్టాలు తప్పలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంతో గుణశేఖర్ భారీ నష్టాల పాలు కాకుండా కొద్ది పాటి నష్టాలతో బయట పడ్డాడని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంత మేర నష్టపోక తప్పలేదు.


సినిమా విడుదలైన కొత్తలో దాసరి నారాయణరావుతో ప్రెస్ మీట్ పెట్టించిన కనిపించిన గుణశేఖర్... అప్పటి నుండి పత్తాలేకుండా పోయాడు. సినిమా మిక్డ్స్ టాక్ రావడం, ఎంతో కొంత నష్టం తప్పదని ముందే తెలియడంతో తాను ప్రమోట్ చేసిన ఫలితం ఉండదనుకున్నాడో ఏమో గానీ గుణశేఖర్ మళ్లీ కనిపించలేదు. అయితే సినిమాను సరిగా ప్రమోట్ చేసిన ఉంటే వసూళ్లు మరికొంత వచ్చేవని అంటున్నారు.

English summary
Rudramadevi movie final result said that, total gross is nearly Rs. 85 cr.
Please Wait while comments are loading...