twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ వద్ద సాయిధరమ్ తేజ్ రచ్చ.. ప్రతి రోజూ ‘కలెక్షన్ల’ పండగే.. 6 రోజుల్లోనే కేక!

    |

    సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి రోజూ పండగే చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 6 రోజున కూడా మంచి వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ వారం విడుదలైన చిత్రాలను ఎదురించి ప్రతి రోజూ పండుగే సినిమా మంచి కలెక్షన్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెరిగింది. గత 6 రోజుల వసూళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..

    6వ రోజు కలెక్షన్లు

    6వ రోజు కలెక్షన్లు

    వినోదం, మానవ సంబంధాల కథాంశంతో తెరకెక్కిన ప్రతి రోజూ పండుగే చిత్రం 6వ రోజున మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ.1.15 కోట్లు, సీడెడ్‌లో రూ.35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.43 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.14 లక్షలు, గుంటూరులో రూ.19 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు వసూలు చేసింది. ఆరవ రోజున ఈ చిత్రం రూ.2.80 కోట్ల వసూళ్లను రాబట్టింది.

    ఏపీ, తెలంగాణలో 6 రోజులుగా

    ఏపీ, తెలంగాణలో 6 రోజులుగా

    ఇక ప్రతీ రోజూ పండగ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.15 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో రూ.6.56 కోట్లు, సీడెడ్‌లో రూ.1.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.21 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.09 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.85 లక్షలు, గుంటూరులో రూ.1.04 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.14 కోట్లు, నెల్లూరులో రూ.50 లక్షలు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఏపీ, తెలంగాణను మినహాయిస్తే.. కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి రోజూ పండగే చిత్రానికి మంచి స్పందన కనిపిస్తున్నది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి గత 6 రోజుల్లో ఈ చిత్రం రూ.1.03 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.2.11 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.18.43 కోట్ల షేర్ (రూ.33.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను) వసూలు చేసింది.

    ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్

    ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక ప్రతి రోజూ పండగే ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.4 కోట్లు, గుంటూరులో రూ.1.4 కోట్లు, కృష్ణా జిల్లా హక్కులు రూ.1.2 కోట్లు, నెల్లూరులో రూ.60 లక్షల మేర బిజినెస్ చేసింది.

    6 రోజుల్లోనే లాభాల్లోకి

    6 రోజుల్లోనే లాభాల్లోకి

    ఏపీ, తెలంగాణ హక్కులు రూ.15.80 కోట్ల మేర బిజినెస్ జరగగా.. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.15.29 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి బిజినెస్ జరిగితే.. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1.03 కోటి వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ.1 కోటి మేర బిజినెస్ జరిగితే రూ.2.11 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం రూ.17.80 కోట్ల బిజినెస్ జరిగితే 6 రోజుల్లోనే రూ.18.43 కోట్ల షేర్ (రూ.33.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను) కొల్లగొట్టింది.

    English summary
    Mega hero Sai Dharam Tej’s Prati roju Pandage good response on 6th day, This movie in AP TG collected share of 2.80cr and worldwide collected share of 3.10 cr on th day of 6. So far This registered Rs.15.29 crores share. Rs.18.43 crores gross.age movie box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X