twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Republic movie 5 days collections: బాక్సాఫీస్ వద్ద దారుణంగా వసూళ్లు.. నిరాశలో..

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్, సెన్సేషనల్ డైరెక్టర్ దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన రిపబ్లిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని రుచి చూస్తున్నది. రిలీజ్ డేట్ నుంచి క్రమంగా ఈ సినిమా వసూళ్లు అంతకంతకు క్షీణిస్తూ వస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ కలెక్షన్లు నమోదయ్యాయి. గత 5 రోజుల వసూళ్ల వివరాల్లోకి వెళితే...

    రిపబ్లిక్ ఐదో రోజు కలెక్షన్లు

    రిపబ్లిక్ ఐదో రోజు కలెక్షన్లు

    ఏపీ, నైజాంలో 5వ రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 12 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 6 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 2 లక్షల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.8 లక్షల రూపాయలు, గుంటూరులో 1.8 లక్షల రూపాయలు, కృష్ణ జిల్లాలో 2.5 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 1.6 లక్షలు రూపాయలు వసూలు చేసింది. 5వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.30 లక్షలు నికరంగా, రూ.56 లక్షలు గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

     మొత్తం 5 రోజుల్లో కలెక్షన్లు ఇలా..

    మొత్తం 5 రోజుల్లో కలెక్షన్లు ఇలా..

    రిపబ్లిక్ చిత్రం గత 5 రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.68 కోట్లు, సీడెడ్‌లో రూ.1.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 36 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 36 లక్షలు, గుంటూరులో 41 లక్షలు, కృష్ణా జిల్లాలో 38 లక్షలు, నెల్లూరు జిల్లాలో 27 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించంది. మొత్తంగా ఈ చిత్రం ఏపీ, నైజాంలో రూ.5.15 కోట్లు నికరంగా, రూ.8.56 కోట్లు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.

    రోజువారీగా రిపబ్లిక్ కలెక్షన్లు

    రోజువారీగా రిపబ్లిక్ కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల కలెక్షన్లు ఇలా నమోదు అయ్యాయి.
    తొలి రోజున ---- 2.01 కోట్లు
    2వ రోజున ---- 1.24 కోట్లు
    3వ రోజున ---- 1.20 కోట్లు
    4వ రోజున ---- 40 లక్షలు
    5వ రోజున ---- 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం రూ.4.85 కోట్లు నికరంగా, రూ.80 కోట్లు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల వసూళ్లు

    తెలుగు రాష్ట్రాలేతర ప్రాంతాల్లో, అలాగే ఓవర్సీస్‌లో కూడా పెద్దగా రిపబ్లిక్ చిత్రం ఆకట్టుకొలేకపోయింది. కర్ణాటకలో రూ.28 లక్షలు, ఓవర్సీస్‌లో 42 లక్షలు, సాధించింది. తెలుగు రాష్ట్రాలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.5.85 కోట్లు నికరంగా, 10.70 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    Recommended Video

    MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
    లాభాల్లోకి రావాలంటే...

    లాభాల్లోకి రావాలంటే...

    ఇక రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరుకోవాలంటే 12.5 కోట్లు సాధించాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రిపబ్లిక్ వసూళ్ల వేగం చూస్తే.. ఈ చిత్రం పక్కాగా నష్టాల్లోనే క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇంకా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 6 కోట్ల రూపాయలకుపైగానే రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఏ మేరకు నష్టాలను మూటగట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Sai Dharam Tej's Republic movie released on Oct 1st. This movie registed 13.5 crores pre release business. But This movie collected around 5.85 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X