»   » వారాహి బ్యానర్...ఓంకార్ తమ్ముడు హీరో

వారాహి బ్యానర్...ఓంకార్ తమ్ముడు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అశ్విన్‌బాబు, తేజశ్వి జంటగా రాకేశ్‌ శశి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'జత కలిసే'. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హాస్య ప్రధాన రొమాంటిక్‌ చిత్రంగా వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది

We are happy to announce that Vaaraahi Chalana Chitrampresents #JataKalisey Movie is all set to release on this Dec 25th !!!

Posted by Vaaraahi Chalana Chitram on 28 November 2015

రాకేష్ శషి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నరేష్ రావూరి నిర్మించారు. అలా మొదలైంది సినిమాలో కీ రోల్ ప్లే చేసిన అశ్విన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. పూర్తి స్దాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో కొర్రిపాటి సాయి తీసుకున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఐస్ క్రీమ్ పాపగా పేరొందిన తేజశ్వి కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి సినిమాల్లో చేస్తూ నటిగా కెరీర్ ని బాగానే నడిపిస్తోంది. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓంకార్ తమ్ముడు అశ్విన్ తో ఓ సినిమాలో నటిస్తోంది. జతకలిసే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా మంచి క్రేజ్ తో బిజినెస్ అవుతోందని తెలుస్తోంది.

ప్రేమలో పడ్డ అబ్బాయి, అమ్మాయిల మధ్య గిల్లికజ్ఞాల్ని ప్రస్తావిస్తూ తీసిన సినిమాగా ఈ పోస్టర్ చెబుతోంది. అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గదితో మొదటి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన అశ్విన్ నటిస్తున్న రెండో సినిమా ఇది రాజు గారి గది సినిమాకి సమర్పకులుగా వ్యవహరించిన వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాకీ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం.

English summary
Vaaraahi Chalana Chitram shared in FB: "We are happy to announce that Vaaraahi Chalana Chitrampresents ‪#‎JataKalisey‬ Movie is all set to release on this Dec 25th !!!"
Please Wait while comments are loading...