ప్రభాస్‌ను టచ్ చేయలేకపోయిన సల్మాన్.. టైగర్ జిందా హై కలెక్షన్లు ఇవే..
ట్యూబ్‌లైట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే అన్ని వర్గాల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. అయితే అందరూ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును తిరగరాస్తుందనే అభిప్రాయంతో సినీ విమర్శకులు, ట్రేడ్ అనలిస్టులు ఉన్నారు. కానీ వారి అంచనాలను చేరుకొన్నట్టు ఏ మాత్రం కనిపించడం లేదు.

ఏక్ థా టైగర్ సీక్వెల్‌గా
ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టైగర్ జిందా హై సినిమాకు ప్రేక్షకులు రైట్ రైట్ అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన క్రిటిక్స్ కూడా సల్మాన్ ఖాన్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ సినిమా చూసిన తర్వాత ఇది క్రిస్మస్ పండుగకు మంచి గిఫ్ట్ అని చెప్పారు.

భారీ కలెక్షన్లపై గురి
టైగర్ జిందా సినిమాకు అన్ని సానుకూలమైన అంశాలు తోడయ్యే సరికి భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రభాస్ నటించిన బాహుబలి2 సినిమా అడ్వాన్సు కలెక్షన్ల రికార్డును తిరగరాస్తుందని అందరూ ఊహించినా.. వాటికి దరిదాపులోకి సల్లూ చిత్రం రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

బాహుబలి రికార్డు కలెక్షన్లు
ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించిన చిత్రంగా బాహుబలి2 చిత్రం ఓ ఘనతను సాధించింది. బాహుబలి2 చిత్రంలో బాలీవుడ్‌లో రూ.50 కోట్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది.

దరిలోకి రాలేని టైగర్ జిందా హై
అయితే బాహుబలి2 రికార్డుకు దగ్గర్లో కూడా టైగర్ జిందా హై రాలేకపోయింది. ఈ చిత్రం 23.50 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక దంగల్ 18.84 కోట్లు, ప్రేమ్ రతన్ ధన్ పాయో 15.73 కోట్లు వసూలు చేసింది.

మరోసారి సల్మాన్‌తో కత్రినా
2012లో రిలీజైన ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్‌గా టైగర్ జిందా హై వచ్చింది. ఈ చిత్రంలో మరోసారి సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జతకట్టారు. యశ్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











