సల్మాన్ కలెక్షన్ల దూకుడు.. శరవేగంగా 200 కోట్ల వైపు..
Box Office
oi-Rajababu
By Rajababu
|
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. తాజాగా రిలీజైన ఆయన చిత్రం టైగర్ జిందా హై వసూళ్ల దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ కలెక్షన్ల వేగం ఏ మాత్రం తగ్గకపోవడం సల్మాన్ స్టామినాకు సాక్ష్యం అంటున్నారు ట్రేడ్ పండితులు.
150 కోట్లకుపైగా వసూళ్లు
టైగర్ జిందా హై చిత్రం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం తిరుగులేని వసూళ్లను సాధించింది. దేశీయ మార్కెట్‌లో శుక్రవారం 34.10 కోట్లు, శనివారం 35.50 కోట్లు, ఆదివారం 45.53 కోట్లు, సోమవారం 36.54 కోట్లతో మొత్తం 151.47 కోట్లు వసూళ్లను సాధించింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
సల్మాన్ మరో బ్లాక్ బస్టర్.. ‘టైగర్ జిందా హై’మూవీ రివ్యూ..
అమెరికాలో మార్కెట్లో
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా టైగర్ జిందా హై చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. అమెరికాలో ఈ చిత్రం శుక్రవారం 443,868 డాల్లర్లను, శనివారం 522,292 డాలర్లతో మొత్తం 966,160 డాలర్లను వసూలు చేసింది.
కెనడాలో వసూళ్లు
ఇక కెనడాలో శుక్రవారం 95,852 డాలర్లను, శనివారం 123, 900 డాలర్లతో మొత్తం 219,752 డాలర్లను వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం సుమారు 7.5 కోట్ల రూపాయలను వసూలు చేసి కొత్త రికార్డులను సృష్టించింది.
వారం ముగింపుకు 200 కోట్లు
2017 ఏడాది ముగింపు ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. రెండోవారం ముగింపులోగా సల్మాన్ చిత్రం ఈ ఘనత సాధించే ఛాన్స్ కనపడుతున్నది.
12వ సారి 100 కోట్ల క్లబ్‌లో
సల్మాన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించాడు. ఆయన నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు 12 సినిమాలు వంద కోట్ల మార్కును తాకాయి. బాలీవుడ్‌లో గానీ, ఇతర భాషల్లో గానీ సల్మాన్‌దే అత్యుత్తమ రికార్డు. దేశీ మార్కెట్‌లో భజరంగీ భాయ్‌జాన్ రూ.320.34 కోట్లు, సుల్తాన్ 302 కోట్లు వసూలు చేయడం విశేషం అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
Salman Khan and Katrina Kaif’s Tiger Zinda Hai is unstoppable. The newly opened spy-thriller has collected a total of Rs 151.47 crore in four days from release. Tiger Zinda Hai will have to gross more than Rs 200 crore by its first week, which is no easy feat.
Story first published: Tuesday, December 26, 2017, 17:51 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more