twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్‌లో గర్జించిన టైగర్‌.. దుమ్మురేపుతున్న సల్మాన్

    By Rajababu
    |

    గతేడాది ట్యూబ్‌లైట్‌ లాంటి అట్టర్‌ఫ్లాప్‌ను చవిచూసిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ టైగర్ జిందా హై‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. డిసెంబర్ 22న రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాది సల్మాన్‌కు మంచి విజయాన్ని అందించింది. ఫ్యాన్స్, సినీ అభిమానుల సానుకూల స్పందనతో భారీ వసూళ్లను సొంతం చేసుకొంటున్నది. తొలిరోజే మంచి వసూళ్లను సాధించిన సల్మాన్ రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగిస్తున్నాడు.

    Recommended Video

    సల్మాన్ మరో బ్లాక్ బస్టర్.. ‘టైగర్ జిందా హై’మూవీ రివ్యూ..
     తొలి రోజు కలెక్షన్లు

    తొలి రోజు కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా 5700 థియేటర్లలో విడుదలైన 'టైగర్‌ జిందా హై' చిత్రం తొలిరోజు రూ. 33 కోట్లు కలెక్షన్లు రాబట్టింది అని సినీ ట్రేడ్‌ నిపుణుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

     రెండోరోజు కలెక్షన్లు

    రెండోరోజు కలెక్షన్లు

    టైగర్ జిందా హై చిత్రం రెండో రోజు 38 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. మూడో రోజు వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

     బ్రిటన్‌లో భారీ కలెక్షన్లు

    బ్రిటన్‌లో భారీ కలెక్షన్లు

    టైగర్ జిందా హై చిత్రం బ్రిటన్‌లో ఆస్ట్రేలియాలో భారీ వసూళ్లను సాధిస్తున్నది. బ్రిటన్‌లో శుక్రవారం 153,157 పౌండ్లను, శనివరాం 192,330 పౌండ్లను సాధించింది. దాదాపు 2.70 కోట్ల వసూలు చేసింది.

     ఆస్ట్రేలియా కలెక్షన్లు

    ఆస్ట్రేలియా కలెక్షన్లు

    టైగర్ జిందా హై చిత్రం ఆస్ట్రేలియాలో 204.906 ఆస్ట్రేలియా డాలర్లను, శనివారం 191476 డాలర్లతో మొత్తం 396.382 అస్ట్రేలియా డాలర్లు వసూలు చేసింది. ఈ మొత్తం భారత కరెన్సీలో 1.96 కోట్లకు సమానం.

     న్యూజిలాండ్‌లోనూ

    న్యూజిలాండ్‌లోనూ

    న్యూజిలాండ్‌లో సల్మాన్ చిత్రం భారీగా ప్రారంభ వసూళ్లను సాధించింది. శుక్రవారం 89.935 న్యూజిలాండ్ డాలర్లను, శనివారం 88.284 న్యూజిలాండ్ డాలర్లతో మొత్తం 178219 న్యూజిలాండ్ డాలర్లు అంటే 80 లక్షల రూపాయలను వసూలు చేసింది.

     ఈ ఏడాది టాప్ వసూళ్లు

    ఈ ఏడాది టాప్ వసూళ్లు

    ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూలుచేసిన టాప్‌-5 సినిమాలు ఇవే

    1. బాహుబలి 2 - రూ. 41 కోట్లు
    2. టైగర్‌ జిందా హై - రూ.33.75 కోట్లు
    3. గోల్‌మాల్‌ అగైన్‌ - రూ.30.14 కోట్లు
    4. ట్యూబ్‌లైట్ - రూ.21.15 కోట్లు
    5. రయీస్ - రూ.20.42 కోట్లు

    English summary
    The last time Salman Khan was seen as RAW (Research and Analysis Wing) agent Tiger, it was in Ek Tha Tiger, in 2012. The film smashed box office records to collect a whopping figure of Rs 32.93 crore on its opening day. The estimates for the second day box-office collection is Rs 38 crore. The film is clearly unstoppable and is all set to do roaring business and make up for the Bollywood losses this year. The film has soared internationally, and has made Rs 2.70 crore in UK.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X