»   » ‘బాహుబలి’కి ప్లస్, ‘సుల్తాన్‌’కి మైనస్ అదే, అందుకే...

‘బాహుబలి’కి ప్లస్, ‘సుల్తాన్‌’కి మైనస్ అదే, అందుకే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ట్రేడ్ వర్గాలు అంతా 'బాహుబలి'రికార్డ్ ని ఓ సారి చూసుకుని, దాంతో ఆ కొత్తగా వచ్చిన చిత్రం పోటీ పడిందా, ఆ రికార్డ్ బ్రద్దలు కొట్టిందా అని లెక్కలు వేసేస్తున్నారు. తాజా బాలీవుడ్ చిత్రం 'సుల్తాన్‌'తొలి రోజు కలెక్షన్స్ ని సైతం ఈ చిత్రంతో పోల్చి, అరెరే..రికార్డ్ ని దాటలేకపోయిందే అంటున్నారు.

'బాహుబలి'తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే...45 కోట్లు నెట్ వచ్చింది. అదే 'సుల్తాన్‌'తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.... 36.54 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే రెండు చిత్రాలకు జానర్ నుంచి రిలీజ్ విషయం దాకా దేంట్లోనూ పోలిక లేదన్నది మాత్రం నిజం.

సుల్తాన్ చిత్రం 4300 స్క్రీన్స్ లో రిలీజైనా బాహుబలిని దాటలేకపోవటానికి కారణం ఇప్పుడు ట్రేడ్ లో ఎనాలసిస్ లు జరుగుతున్నాయి. అక్కడ తేలిందేమిటంటే..బాహుబలి కు ప్లస్ అయ్యింది..తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఒకే సారి రిలీజ్ అవటం. అది సుల్తాన్ కు జరగలేదు.
కేవలం హిందీ వెర్షన్ అంతటా విడుదలైంది.

Salman's Sultan fails to beat Baahubali

ఇక ఒక్క తెలుగు నుంచే బాహుబలికి 30 కోట్లు తొలి రోజు కలెక్షన్స్ వచ్చింది. దానికి తోడు సుల్తాన్ చిత్రం స్పోర్ట్స్ ఫిలిం కావటం. ఇవన్నీఆలోచిస్తే సుల్తాన్ చిత్రం దాని స్దాయిలో ఓ రేంజిలో కలెక్ట్ చేసినట్లే మరి.

'సుల్తాన్‌' కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ మల్లయోధుడిగా నటించిన 'సుల్తాన్‌' చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.ఈద్‌ సందర్భంగా బుధవారం విడుదలైన ఈ చిత్రం 2016 బాలీవుడ్‌ తొలిరోజు కలెక్షన్లలో షారుక్‌ ఖాన్‌ 'ఫ్యాన్‌'ని అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

ఈ ఏడాది తొలిరోజు వసూళ్లలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన సినిమాల వివరాలు ఓ సారి చూద్దాం..

English summary
Baahubali: The Beginning has collected whopping a‚ 45 Cr nett on Day 1, while Sultan has to wrap the day with a‚ 36.54 Cr nett on Day 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu