»   » ‘హృదయ కాలేయం’ కలెక్షన్ల పరిస్థితి ఏంటి?

‘హృదయ కాలేయం’ కలెక్షన్ల పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన 'హృదయ కాలేయం' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ వేదికగా చేసుకుని సినిమాకు ముందు నుండీ మంచి ప్రచారం కల్పించడంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

సినిమా విడుదలైన కేంద్రాల సంఖ్యతో పోలిస్తే....ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లు ఈ సినిమాతో పాటు విడుదలైన 'రౌడీ' చిత్రం కంటే బెటరే అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలి రోజు 260 స్క్రీన్లలో విడుదల చేసారు. తొలిరోజు ఈచిత్రం విడుదలైన చోట్లలో 30% నుండి 35% ఆక్యుపెన్సీ సాధించింది.

Sampoornesh’s Hrudaya Kaleyam (3 Days) First Weekend Collection At Box Office

సినిమా ఫర్వాలేదనే టాక్ రావడంతో శని, ఆది వారాల్లో సినిమాకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. మొదటి మూడు రోజుల్లో ఈచిత్రం రూ. 6.75 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ. 2 కోట్ల పై చిలుకు, రెండో రోజు రూ. 2.25 కోట్లు, మూడో రోజు 2.50 కోట్లు వసూలైనట్లు సమాచారం.

మొత్తానికి ఇంటర్నెట్ ద్వారా వినూత్నమైన ప్రచారం, ఫర్నీగా సాగే స్టోరీలైన్, వింత లక్షణాలు ఉన్న హీరో పర్సనాలిటీ, పెర్ఫార్మెన్స్ వెరసి...... అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన 'హృదయ కాలేయం' చిత్రానికి మంచి లాభాలే వస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చిన క్రేజ్‌తో 'కొబ్బరి మట్ట' అనే మరో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు సంపూర్ణేష్ బాబు.

English summary
Director Steven Shankar's Telugu movie Hrudaya Kaleyam, which marks the acting debut of Sampoornesh Babu, has registered decent response at the Andhra Pradesh Box Office on its opening day. Considering its volume of release in the state, its first day collection is far better than Ram Gopal Varma's much-talked about film Rowdy featuring popular stars Mohan Babu and Vishnu Manchu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu