For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖరారు: సందీప్ కిషన్ 'బీరువా' విడుదల తేదీ

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన చిత్రం 'బీరువా'. 'సంజుగాడి ఫ్రెండ్‌..' అనేది ఉపశీర్షిక. సందీప్‌కిషన్‌, సురభి జంటగా నటించారు. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''ఒక బీరువా చుట్టూ సాగే కథ ఇది. సంజు అనే కుర్రాడికీ, వాళ్లింట్లో ఉన్న బీరువాకీ మధ్య ఏం జరిగిందో తెరపైనే చూడాలి. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది. సందీప్‌కిషన్‌, సురభి జంట తెరపై చూడముచ్చటగా కనిపిస్తుంది. తమన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ఇటీవల విడుదలైన పాటలు విజయవంతమయ్యాయి'' అన్నారు.

  సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ''ప్రేక్షకుడిని అలరించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. 'బీరువా' పాటలు విజయవంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

  ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న దాన్ని బట్టి ఈ చిత్రం ఫస్టాఫ్ ...ఏవరేజ్ గా ఉంటుంది. సెకండాఫ్ మాత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా నడుస్తుంది. ఈ చిత్రానికి పూర్తి పాజిటివ్ టాక్ నడుస్తోంది. జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్, కమిడియన్ సప్తగిరి ఈ చిత్రంలో మెయిల్ హైలెట్స్ అని తెలుస్తోంది.

  సందీప్ కిషన్, సప్తగిరి, షకలక శంకర్ ల మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు థియోటర్లలని నవ్వులతో ముంచెత్తుతాయని టాక్. క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నా...ఓవరాల్ గా వెంకటాద్రి ఎక్సప్రెస్ రేంజిలో హిట్ అయ్యే అవకాసముందని అంటున్నారు. ఫ్లాఫులతో ప్రయాణం చేస్తున్న సందీప్ కిషన్ కు ఈ చిత్రం ఊరట నిచ్చి నిలబెడుతుందని వినిపిస్తోంది. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరాలందించారు.

  Sandeep kishan's Beeruva confirmed for Jan 23rd

  హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఉషాకిరణ్‌ మూవీస్‌ లాంటి పెద్ద సంస్థలో సినిమా చెయ్యడం నా అదృష్టం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో జెమిని కిరణ్‌గారు నన్ను మరో మెట్టెక్కించారు. ఇందులో నా పాతర వైవిధ్యంగా ఉంటుంది. నటనలో నా పరిధిని పెంచే సినిమా ఇది. కుటుంబం మొత్తం చూసేలా దర్శకుడు మలిచారు. తమన్‌ చక్కని స్వరాలందించారు. ప్యూచర్‌లో ఆయనతో మరిన్ని సినిమాలు చెయ్యబోతున్నా'' అని అన్నారు.

  మనకేమైనా సమస్యలొస్తే స్నేహితుల్నో, కుటుంబ సభ్యుల్నో సాయం అడుగుతాం. కానీ సంజు మాత్రం బీరువాని అడుగుతాడు. చిన్నప్పట్నుంచీ అతనిది అదే వరస. అతడికి కష్టం ఎదురైన ప్రతీసారీ ఓ ఆపద్బాంధవుడిలా ఆదుకొంటుంది బీరువా. చివరికి తన ప్రేమ విషయంలోనూ అదే జరిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సందీప్‌కిషన్‌.

  దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ ‘‘ఎప్పటి నుంచో ఉషాకిరణ్‌ సంస్థలో సినిమా చెయ్యాలని ప్రయత్నిస్తున్నా. ‘బీరువా'తో కుదిరింది. నా తొలి సినిమాలాగా భావించి తెరకెక్కించాను. కమర్షియల్‌ హంగులతో వినోదాత్మకంగా సాగుతుంది. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది'' అని తెలిపారు. ‘

  ‘కణ్మణి ఎంతో క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు. కథానుగుణంగా చక్కని పాటలు రాబట్టుకున్నారు. సందీప్‌ కెరీర్‌ని మలుపు తిప్పే చిత్రమిది'' అని ఎస్‌.ఎస్‌.తమన్‌ అన్నారు. ‘‘తెలుగులో తొలి సినిమా ఇది. నాయికగా గుర్తింపు తెచ్చే పాత్ర చేశాను'' అని హీరోయిన్ సురభి చెప్పారు.

  ఈ చిత్రంలో బీరువా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కథానాయకుడికి ఎలాంటి సమస్య ఎదురైనా బీరువా సాయంతో అధిగమిస్తుంటాడు. ఆ సన్నివేశాలు వినోదాన్ని పంచిపెడతాయని అంటున్నారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. సందీప్‌కిషన్‌ అల్లరి కుర్రాడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడని, తన చుట్టూ ఉన్నవాళ్లందరికీ చిక్కులు తెచ్చిపెడుతుంటాడని తెలుస్తోంది.

  'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఒప్పుకొన్న సినిమా ఇది. నటుడిగా నాకు ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. కథ, కథనం... అన్నీ కొత్త తరహాలో సాగుతుంటాయి. కణ్మణి ఈ చిత్రంతో నా నటనకు మరిన్ని మెరుగులు దిద్దారు. మా ఛోటా మావయ్య ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించారు. ఆయన సెట్‌లో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. తమన్‌, గౌతంరాజు లాంటి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేసింది. వెలిగొండ శ్రీనివాస్‌ రాసిన మాటలు త్రివిక్రమ్‌ను గుర్తుకు తెప్పిస్తాయి. 'బీరువా' తప్పకుండా ఒక మంచి వినోదాత్మక సినిమా అవుతుంది అన్నారు సందీప్ కిషన్.

  ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ''ఈ సినిమా పేరు గురించి మొదట వి.వి.వినాయక్‌తో చెప్పాను. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో పాటు మీరంతా కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'బీరువా'అంటే ఆసక్తికరంగానే ఉంటుందని ప్రోత్సహించారు. ఇప్పుడు నిజంగానే ఆ పేరుపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది'' అన్నారు ఛోటా కె.నాయుడు.

  నరేష్‌, ముఖేష్‌ రుషి, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితాచౌదరి, అనీషాసింగ్‌, సంధ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, కళ: సాహి సురేష్‌, నృత్యాలు: రాజుసుందరం, బాబాభాస్కర్‌, శేఖర్‌, పోరాటాలు: వెంకట్‌, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు

  English summary
  Sundeep Kishan latest film Beeruva is all set for a grand release on January 23rd.Tamil Director Kanman who made films like Naa Oopiri and Chinnodu is directing Beeruva, which is jointly produced by Anandi Arts and Usha Kiran Movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X