రణబీర్ కెరీర్లో టాప్... వారంలో రూ. 200 కోట్లు వసూలు చేసిన ‘సంజు’
Recommended Video

రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. గురువారంతో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. రణబీర్ కపూర్ కెరీర్లో ఇంత భారీ మొత్తం వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 100 కోట్లకు చేరువైన ఈ చిత్రం.... వీక్ డేస్‌లో కూడా ప్రేక్షకుల తాకిడి తగ్గక పోవడంతో వసూళ్ల వరద పారుతోంది.

తొలి వారం వసూళ్ల వివరాలు..
ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం.... ‘సంజు' మూవీ ఇండియాలో తొలి వారం రూ. 202.51 కోట్లు రాబట్టింది. తొలిరోజైన శుక్రవారం రూ. 34.75 కోట్లు, శనివారం 38.60 కోట్లు, ఆదివారం 46.71 కోట్లు, సోమవారం 25.35 కోట్లు, మంగలవారం 22.10 కోట్లు, బుధవారం 18.90 కోట్లు, గురువారం 16.10 కోట్లు రాబట్టింది.

రణబీర్ కెరీర్లో తొలి రూ. 200 కోట్ల మూవీ
రణబీర్ కపూర్ కెరీర్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ‘సంజు' నిలిచింది. గతంలో రణబీర్ నటించిన ‘యే జవానీ హై దివానీ' చిత్రం రూ. 188.57 వసూలు చేయగా ‘సంజు' దాన్ని అధిగమించింది.

కంటెంటే కింగ్ అని మరోసారి
సినిమాలో మంచి కంటెంట్ ఉంటే నాన్ హాలిడే సీజన్లో కూడా సినిమాలు భారీ వసూళ్లు సాధించగలవని ‘సంజు' మూవీతో మరోసారి రుజువైంది. సంజు కంటే ముందు విడుదలైన రాజి, సోను కె టిటు కి స్వీటీ చిత్రాలను కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

బాలీవుడ్లో సరికొత్త రికార్డులు ఖాయం
వచ్చే వారం, ఆ తర్వాత వారం పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. మరో వైపు సంజు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. కలెక్షన్ల జోరు చూస్తుంటే ఈ చిత్రం బాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











