Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంజు కలెక్షన్ల సునామీ.. రూ.500 కోట్ల క్లబ్లో..
బాలీవుడ్లో వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్లపరంగా మ్యాజిక్ చేస్తున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
రూ.500 కోట్ల క్లబ్లో సంజు
సంజు చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నదని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్లో చేరి మరింత వేగంగా దూసుకెళ్తున్నది అని ట్వీట్లో పేర్కొన్నారు.
|
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా సంజు రూ.500.43 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.295.18 (378.43 కోట్ల గ్రాస్) నికర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో ఈ చిత్రం 122 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. మొత్తంగా ఈ చిత్రం రూ.500.43 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్లో పేర్కొన్నారు.
|
రెండు వారాల్లో కలెక్షన్లు
రెండు వారాల సంజు కలెక్షన్లు బ్రహ్మండంగా ఉన్నాయి అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నది. మొదటి వారం ఈ చిత్రం రూ.202.51 కోట్లు, రెండోవారం 92.67 కోట్లు వసూళు చేసింది. ఇండియాలో 295.18 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అని తరణ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
సంజుపై హిరానీ నిర్ణయం
వాస్తవానికి సంజు చిత్రాన్ని రాజు హిరానీ తీయడానికి వెనుక ముందు ఆలోచించాడట. ఓ దశలో సంజు చిత్రాన్ని ఆపివేసి మున్నాభాయ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించాలని నిర్ణయం తీసుకొన్నాడట. అయితే సన్నిహితుల ఒత్తిడి మేరకు సంజు చిత్రాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది అని రాజు హిరానీ పేర్కొన్నారు. సంజు చిత్రాన్ని పెద్ద మొత్తంలో ప్రేక్షకులు ఆదరించడంపై సంతోషంలో ఉన్నారు.