For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sankranthi Box Office Fight: ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ మధ్య ఫైట్.. లీకైన రిలీజ్ డేట్స్ ఇవే!

  |

  సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటే ఎంతో ప్రత్యేకం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు నాలుగు సెలవు రోజులను అనుకూలంగా మలచుకుని కలెక్షన్లను దండుకోవాలన్న ఉద్దేశంతో తమ సినిమాలను విడుదల చేయడానికి ఫిల్మ్ మేకర్లు సన్నాహాలు చేస్తుంటారు. దీంతో ప్రతి ఏడాదీ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైటింగ్ చూస్తున్నాం. ఇక, వచ్చే ఏడాది ఈ పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. దీనికి కారణం ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌లు పోటీ పడుతుండడమే. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  కరోనా వల్ల కళ తప్పిన గత సంక్రాంతి

  కరోనా వల్ల కళ తప్పిన గత సంక్రాంతి

  సంక్రాంతి సీజన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. 2019లో ‘అల.. వైకుంఠపురములో', ‘సరిలేరు నీకెవ్వరు' వంటి ఇండస్ట్రీ హిట్లు రావడంతో నిర్మాతపై కాసుల వర్షం కురిసింది. అయితే, గత ఏడాది మాత్రం కరోనా నిబంధనల కారణంగా ‘క్రాక్', ‘రెడ్' మినహా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ఇక, తమిళ చిత్రం ‘మాస్టర్' కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.

  Vadinamma : దమయంతి శపధం.. వెన్నుపోటు పెండింగ్, ఎలా జరుగుతుందో చూస్తానంటూ!

   వచ్చే సంక్రాంతికి మాత్రం భీకర పోరు

  వచ్చే సంక్రాంతికి మాత్రం భీకర పోరు

  ఈ ఏడాదిలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో థియేటర్లు మూత పడిపోవడంతో, షూటింగులు నిలిచిపోవడంతో పెద్ద పెద్ద సినిమాల విడుదలలు వాయిదా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వచ్చే పొంగల్ సీజన్‌లో భీకరమైన పోరు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. బడా హీరోలంతా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యారు.

  పవన్ రానా మూవీతో ఫైట్ ప్రారంభం

  పవన్ రానా మూవీతో ఫైట్ ప్రారంభం

  వచ్చే సంక్రాంతి సీజన్‌కు ముందుగా పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమా.. ‘అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తుంది. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ బీమ్లా నాయక్‌గా, రానా లోకల్ డాన్‌గా నటిస్తున్నారు.

  పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర పూరి బ్యూటీఫుల్ ఫొటోస్.. చాలా రోజుల తరువాత ఇలా కొత్తగా..

  రెండో అడుగు మహేశ్ బాబు మూవీదే

  రెండో అడుగు మహేశ్ బాబు మూవీదే

  సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాల జాబితాలో మహేశ్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట' కూడా ఉండనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుందట. పరుశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  ప్రభాస్ కూడా ఫైటింగ్‌కు సిద్ధంగానే

  ప్రభాస్ కూడా ఫైటింగ్‌కు సిద్ధంగానే

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో ‘రాధే శ్యామ్' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుందట. ఇక, తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

   మరోసారి సంక్రాంతి అల్లుళ్ల ఫన్ రైడ్

  మరోసారి సంక్రాంతి అల్లుళ్ల ఫన్ రైడ్

  కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘F3' రాబోతుంది. ఇక, ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగానే జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసింది.

  English summary
  Two Telugu States and in Overseas region are eagerly waiting for Sankranthi films. This Time Radhe Shyam, Sarkaru Vaari Paata, F3 and PSPKRana Movie Will Fight at Sankranthi Box Office Race
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X