»   » బాహుబలికి ఝలక్: ‘సర్దార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియా వైజ్)

బాహుబలికి ఝలక్: ‘సర్దార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాలతో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రివ్యూల పరంగా చూస్తే ఎక్కువ శాతం యావరేజ్ రేటింగే వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడం, సినిమా టాక్ తెలియక ముందే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగడంతో ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో తొలిరోజు ఈ చిత్రం రూ. 5 కోట్ల పైనే వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రం ఇది మాత్రమే అని అంటున్నారు. ఫ్లాట్ రేట్స్ కావడంతో సీడెడ్ ఏరియాలో కూడా భారీగా రూ. 4.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం బాహుబలి తొలిరోజు వసూళ్లను సైతం దాటేసింది. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఏరియాల్లో బాహుబలికంటే ఎక్కువ వసూలు చేయడం గమనార్మం. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా సర్దార్ గబ్బ్ సింగ్ వసూళ్లు అదిరిపోయాయి.

నార్త్ అమెరికాలో గురువారం రాత్రి నుండే సర్దర్ గబ్బర్ సంగ్ షోలు మొదలయ్యాయి. దాదాపు 300 స్క్రీన్లలో సినిమా వేసారు. కొన్ని ఏరియాల్లో టికెట్ రేటు 25 డాలర్లకు పెంచారు. తొలి రోజు ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద $615,853 (రూ. 4.10 కోట్లు) వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు.

మరో వైపు సినిమా విడుదల ముందే ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేసారు. వీటి ద్వారా కూడా భారీగా వసూల్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపి, తెలంగాణల్లో కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 26 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. ఇక గ్లోబల్ గ్రాస్ కలెక్షన్ రూ. 35 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కెరీర్లోనే 'సర్దార్ గబ్బర్ సింగ్' బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆయన గత చిత్రం 'అత్తారింటికి దారేది' రూ. 10.75 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఇక టాలీవుడ్లో బాహుబలి తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' రికార్డుల కెక్కింది. ఇంతకు ముందు బాహుబలి తర్వాత స్థానంలో రూ. 19 కోట్లో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఉండేది. ఇపుడు ఆరికార్డును సర్దార్ బద్దలు కొట్టింది.

స్లైడ్ షో సర్దార్ గబ్బర్ సింగ్ ఏరియా వైజ్ వసూళ్లు. ట్రేడ్ వర్గాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం మాత్రమే, అఫీషియల్ లెక్కల్లో కాస్త తేడా ఉండొచ్చు.

నైజాం

నైజాం

బాహుబలి రూ. 6.3 కోట్లు
శ్రీమంతుడు రూ. 5.09 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 5 కోట్ల పైనే
అత్తారింకటికి దారేది రూ. 3.28 కోట్లు

సీడెడ్

సీడెడ్

బాహుబలి రూ. 5.08 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 4.15 కోట్లు
శ్రీమంతుడు రూ. 2.11 కోట్లు
అత్తారింకటికి దారేది రూ.2.10 కోట్లు

వైజాగ్

వైజాగ్

సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 2.01 కోట్లు
బాహుబలి రూ.1.75 కోట్లు
శ్రీమంతుడు రూ. 1.05 కోట్లు
అత్తారింకటికి దారేది రూ. 0.87 కోట్లు

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 2.14 కోట్లు
బాహుబలి రూ. 1.98 కోట్లు
శ్రీమంతుడు రూ. 1.51 కోట్లు
అత్తారింకటికి దారేది రూ. 1.05 కోట్లు

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 2.70 కోట్లు
బాహుబలి రూ. 2.57 కోట్లు
శ్రీమంతుడు రూ. 1.70 కోట్లు
అత్తారింకటికి దారేది రూ. 0.76 కోట్లు

కృష్ణ

కృష్ణ

సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 1.51 కోట్లు
బాహుబలి రూ. 1.25 కోట్లు
శ్రీమంతుడు రూ. 1.07 కోట్లు
అత్తారింకటికి దారేది రూ. 0.71 కోట్లు

గుంటూరు

గుంటూరు

బాహుబలి రూ. 2.54 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 2.46 కోట్లు
శ్రీమంతుడు రూ. 1.68 కోట్లు
అత్తారింకటికి దారేది రూ.1.40 కోట్లు

నెల్లూరు

నెల్లూరు

బాహుబలి రూ. 0.93 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ రూ. 0.85 కోట్లు
శ్రీమంతుడు రూ. 0.51 కోట్లు
అత్తారింకటికి దారేది రూ.0.58 కోట్లు

English summary
Power Star Pawan Kalyan's 'Sardaar Gabbar Singh' opened with mixed reports, but they didn't stop the movie collecting record shares.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu