»   » పవన్ కళ్యాణా మజాకా! ‘సర్దార్..’ బిజినెస్ రూ. 100 కోట్లు!

పవన్ కళ్యాణా మజాకా! ‘సర్దార్..’ బిజినెస్ రూ. 100 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో రాబోతున్న పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రేడ్ వర్గాల విశ్లేషణల ప్రకారం ఈ చిత్రం బిజినెస్ రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు.

పవన్ స్టార్ ఇంతకు ముందు నటించిన రికార్డ్ బ్రేకింగ్ మూవీ ‘అత్తారింటికి దారేది'. ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో కేవలం థియేటర్ బిజినెస్ పరంగానే రూ. 75 కోట్ల మార్కను అందుకున్న తొలి తెలుగు సినిమా. ఈ నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం బిజినెస్ అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు.


ఇప్పటి అంచనాల ప్రకారం‘సర్దార్ గబ్బర్ సింగ్' థియేటర్ల ద్వారా రూ. 85 కోట్ల బిజినెస్ చేయడం ఖాయం అనే అంచనాలన్నాయి. ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఇతర రైట్స్ అన్ని కలిపి ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు.


Sardaar Gabbar Singh business predictions Rs.100 cr

ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలను మార్చి 12న నిర్వహించనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్.

English summary
Powerstar Pawan Kalyan's much awaited film, Sardaar Gabbar Singh Business Predictions Rs.100 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu