»   » 'సర్దార్' ప్రీ రిలీజ్ బిజినెస్: షాకయ్యే ఫిగర్స్, బ్లాక్ బస్టర్ అయితేనే రికవరీ?

'సర్దార్' ప్రీ రిలీజ్ బిజినెస్: షాకయ్యే ఫిగర్స్, బ్లాక్ బస్టర్ అయితేనే రికవరీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సమ్మర్ సంగ్రామం మొదలైంది. ఈ సంగ్రామంలో స్టార్ ఇమేజ్‌తోను, యాక్షన్‌తోను, ఫీల్ లవ్‌తోను, మాస్ హంగామాతోను ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి పెద్దా, మీడియం రేంజ్ సినిమాలు వరుసపెట్టనున్నాయి.

ఈ నేపధ్యంలో ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపుదిద్దుకుంటున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సైతం సమ్మర్ వినోదాత్మక సినిమాగా రాబోతోంది. షూటింగ్ దశనుండే అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచిన పవన్‌కల్యాణ్, ఈ సినిమాతో నిన్న మొన్నటి సినిమాలకంటే తన రేంజ్‌ని మరో మెట్టుపైకి తీసుకెళ్తాడని అంటున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం -పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రంగానూ నమోదు అవుతోంది. ఈ చిత్రం సినిమా ఆడియో హక్కులే 2 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. తెలుగు సినిమా చరిత్రకు ఇదొక హైలెట్. దాంతోపాటు బిజినెస్ వర్గాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న చిత్రాన్ని -అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయి.

సమ్మర్ సీజన్‌లో పవన్‌కల్యాణ్ సినిమాలకు ఎలాగూ గిరాకీ ఉంటుంది కనుక, లెక్కకుమించి థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. అందాల భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీరాయ్, సంజన ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తార్ట అనే విషయాలు బిజినెస్ ని పతాక స్దాయికి తీసుకువెళ్లాయి.

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పవన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు హిందీలో ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్...

 నైజాం

నైజాం

సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం నైజాం ఏరియాలో 21 కోట్లుకు అమ్మారని చెప్తున్నారు.

సీడెడ్

సీడెడ్


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం సీడెడ్ ఏరియాలో 10.44 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

నెల్లూరు

నెల్లూరు

సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం నెల్లూరు ఏరియాలో 2.70 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

కృష్ణా

కృష్ణా

సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం కృష్ణా ఏరియాలో 4.05 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

గుంటూరు

గుంటూరు

సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం గుంటూరు ఏరియాలో 5.40 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

వైజాగ్

వైజాగ్


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం వైజాగ్ ఏరియాలో 7.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం తూర్పు గోదావరి ఏరియాలో 5.40 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం పశ్చిమ గోదావరి ఏరియాలో 4.05 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

కర్ణాటక,దేశంలో మిగతా ప్రాంతాలు

కర్ణాటక,దేశంలో మిగతా ప్రాంతాలు

సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం కర్ణాటక,దేశంలో మిగతా ప్రాంతాల్లో 9.00 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఓవర్ సీస్

ఓవర్ సీస్


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం ఓవర్ సీస్ లో 11.00 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

శాటిలైట్ రైట్స్

శాటిలైట్ రైట్స్


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం శాటిలైట్ రైట్స్ 13.5 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

డబ్బింగ్, ఆడియో రైట్స్ వగైరా

డబ్బింగ్, ఆడియో రైట్స్ వగైరా


సర్దార్ గబ్బర్‌ సింగ్ చిత్రం డబ్బింగ్, ఆడియో రైట్స్ వగైరా 5.5 కోట్లకు వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తం

మొత్తం

మొత్తం అన్నీ కలిసి ప్రీ రిలీజ్ బిజినెస్ 102 కోట్లకు చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

English summary
Here is the details of Sardaar Gabbar Singh Pre-release Business
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu