»   »  ‘సర్దార్’ను థియేటర్లో అంతసేపు భరించాలా?

‘సర్దార్’ను థియేటర్లో అంతసేపు భరించాలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య చాలా సినిమాల విషయంలో విడుదలైన తర్వాత నిడివి ఎక్కువగా ఉంది, ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు అనే మాట తరచూ వింటున్నాం. ఇలాంటి సినిమాలను విడుదలైన మరుసటి రోజే ట్రిమ్ చేసి రిలీజ్ చేయడం లాంటివి చేయడం చూసాం. ఇవన్నీ రెండున్నర గంటల లోపు ఉన్న సినిమాల సంగతి.

అయితే త్వరలో విడుదల కాబోతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా నిడివి మాత్రం మామూలు సినిమాల కంటే చాలా ఎక్కువగా ఉంది. 164 నిమిషాల నిడివి ఉంటుందట. అంటే 2.44 గంటలు. సెన్సార్ కీ ఇంత నిడివి ఉన్న సినిమానే వెళ్లింది. సెన్సార్ బోర్డు కూడా సినిమాకు ఎలాంటి కటింగ్స్ వేయలేదు.


అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ), నిర్మాత శరత్ మారార్ కాస్త ఆందోళనగానే ఉన్నారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం....నాకు నమ్మకం ఉంది అలానే ఉండనివ్వండి అని తేల్చేసారట. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా కొన్ని సీన్లు ట్రిమ్ చేసి పెట్టమని చెప్పినట్లు సమాచారం. ఫస్ట్ డే టాక్ చూసిన తర్వాత 2.44 గంటల సినిమాను కొనసాగించాలా? ట్రిమ్ చేసిన వెర్షన్ రిలీజ్ చేయాలా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


2.44 గంటలు మనం సినిమాను ఎలాంటి బోర్ ఫీల్ కాకుండా భరించగలిగితే... సినిమా సూపర్ హిట్టే అంటున్నారు. ఏప్రిల్ 8న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ వరకు టిక్కెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 50 దేశాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


ఉత్సాహం

ఉత్సాహం


ఏప్రిల్ 8 న దగ్గర పడుతుండటం తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చెప్పలేనంత ఉత్సాహం ఉరకలెత్తుతున్నది.


స్పోషల్ షోలు...ఉగాది రోజున ఏప్రిల్ 8 న

స్పోషల్ షోలు...ఉగాది రోజున ఏప్రిల్ 8 న


'సర్దార్ గబ్బర్ సింగ్'విడుదల కంటే ముందు రోజురాత్రి రెండు తెలుగు
రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రత్యేకంగా స్పెషల్ షోలువేస్తుండటమే దీనికి కారణం.
ప్రత్యేకించి హైదరాబాద్ లో చాలా థియేటర్ల లో స్పెషల్ షోలు వేస్తున్నారు.


డిమాండ్

డిమాండ్


ఈ షోల టికెట్ల కోసం ఉన్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ షోల నిర్వాహకులు విపరీతంగా రేట్లను పెంచేశారు. అయినప్పటికీ టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి.


భారీ కలెక్షన్స్

భారీ కలెక్షన్స్


విడుదల ముందు రోజు రాత్రి వేయనున్ను ఈ స్పెషల్ షోల ద్వారా విపరీతమైన కలెక్షన్స్ వస్తాయని వీటి నిర్వాహకులు భావిస్తున్నారు.


సర్దార్

సర్దార్


బాబీ దర్శకత్వం లో వస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' లో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, లక్ష్మి రాయ్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది.


అంచనాలు

అంచనాలు


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


English summary
'Sardaar Gabbar Singh' run time is 164 minutes. Run Time does play a crucial role in the success of a movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X