»   » సర్దార్ గబ్బర్ సింగ్...యూఎస్ఏలో చెత్త రికార్డ్!

సర్దార్ గబ్బర్ సింగ్...యూఎస్ఏలో చెత్త రికార్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' పాత రికార్డులను బద్దలు కొడుతుందనుకుంటే అలాంటిదేమీ జరుగలేదు. ఆశించిన స్థాయిలో సినిమాకు వసూళ్లు రాక డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకర స్థితిలో ఉన్నారు. యూఎస్ఏలో కూడా ఈ చిత్రం పరిస్థితి దారుణంగా. పైగా అక్కడ ఈచిత్రం కొన్ని చెత్త రికార్డులను కూడా సృష్టించింది. ఆ రికార్డుల కమామిషు ఏమిటో చూద్దాం..

యూఎస్ఏలో సెకండ్ వీకెండ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' 55 స్క్రీన్లలో ప్రదర్శితం అయింది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి రెండో వారం అయినా ఇన్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇన్ని స్క్రీన్లలో ప్రదర్శితం అయినా కలెక్షన్స్ మాత్రం కేవలం 20,807 డాలర్లు మాత్రమే వసూలుయ్యాయి. ఒక పెద్ద హీరో నటించిన తెలుగు సినిమా ఇన్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితం అయి ఇంత తక్కువ వసూలు చేయడం ఇదే తొలిసారి. ఇది ఇక్కడ ఓ చెత్త రికార్డుగా అభివర్ణిస్తున్నారు అక్కడి ట్రేడ్ వర్గాలు.


Sardar Gabbar Singh Creates low 'Record' In USA

ఇప్పటి వరకు 'సర్దార్ గబ్బర్ సింగ్' యూఎస్ఏలో $10, 58,000 (రూ. 7.04 కోట్లు) వసూలు చేసింది. సెకండ్ వీక్ లో పరిస్థితి చూసాక ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్‌కు రూ. 4.5 కోట్ల నష్టం తప్పదని అంటున్నారు.


యూఎస్ఏలో ప్రదర్శితం అవుతున్న ఇతర సినిమాల విషయానికొస్తే నాగార్జున 'ఊపిరి' చిత్రం 23 స్క్రీన్లలో ప్రదర్శితం అయి 14,593 వసూలు చేసింది. ఇప్పటి వరక ఈ చిత్రం $15,58,600 (10.38 కోట్లు) వసూలు చేసింది.

English summary
In its second weekend in US, “Sardaar Gabbar Singh” has grossed mere 20,807 dollars from 55 screens. For a big movie like this, the collections are almost like nil. No big star Telugu movie has grossed such low from 55 screens. So Pawan Kalyan’s movie has set a new record of lowest collections for a Telugu biggie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu