twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sardar day 1 collections కార్తీ మూవీకి భారీ రెస్పాన్స్.. సర్దార్ తోలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత విలక్షణ నటుడు కార్తీ రేంజ్ మరింత పెరిగింది. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత కార్తీ నటించిన సర్దార్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దక్షిణాదిలో సర్దార్ మూవీ భారీగా రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. రాశీఖన్నా, లైలా, విజేష విజయన్, చంకీ పాండే నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ మూటగట్టుకొన్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్ తర్వాత అక్యుపెన్సీ, తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించిన సర్దార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ బిజినెస్ నమోదు చేసింది. తమిళనాడు మినహాయిస్తే ఈ చిత్రం 64 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌గా రాబట్టింది. టెలివిజన్ , డిజిటల్ రైట్స్ 31 కోట్లు పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ 11 కోట్ల మేర జరిగింది. తెలుగు థియేట్రికల్ రైట్స్ 8 కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్ 3 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ 6 కోట్ల మేర జరిగాయి. అలాగే కర్ణాటక, కేరళ థియేట్రికల్ హక్కులు రూ.2.6 లక్షల మేర బిజినెస్ జరిగింది.

    తమిళంలో భారీగా రెస్పాన్స్

    తమిళంలో భారీగా రెస్పాన్స్

    కార్తీ నటించిన సర్దార్ చిత్రానికి తమిళంలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ చిత్రం ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. చెన్నైలో 41 శాతం, కోయంబత్తూరులో 35 శాతం, పాండిచ్చేరిలో 70 శాతం, సాలెం 36 శాతం, త్రిచూరులో 53 శాతం, మిగితా ప్రాంతాల్లో 30 శాతం మేర అక్యుపెన్సీ నమోదైంది.

    తెలుగులో మోస్తారు ఆక్యుపెన్సీ

    తెలుగులో మోస్తారు ఆక్యుపెన్సీ

    ఇక తెలుగు వెర్షన్ సర్దార్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 22 శాతం, బెంగళూరులో 85 శాతం, వరంగల్‌లో 28 శాతం, గుంటూరు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రిలో 25 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. నైజాంలో పెద్దగా ఈ సినిమా ప్రభావం చూపలేకోపొయింది.

    అమెరికాలో తొలిరోజు కలెక్షన్లు

    అమెరికాలో తొలిరోజు కలెక్షన్లు

    సర్దార్ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఈ సినిమాను 196 లొకేషన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ మొదటి రోజున 43000 డాలర్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో ఈ సినిమా 40 లక్షల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.

    ఏపీ, నైజాంలో తొలి రోజు

    ఏపీ, నైజాంలో తొలి రోజు

    ఇక సర్దార్ మూవీ ఏపీ, తెలంగాణ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సర్దార్ చిత్రం టాప్ పొజిషన్‌లో నిలిచింది. ప్రిన్స్, జిన్నా, ఓరి దేవుడా సినిమాలతో పోల్చుకొంటే సర్దార్ చిత్రం ఒక్కడుగు ముందులో ఉంది. ఈ సినిమా తొలి రోజున 95 లక్షల రూపాయల షేర్‌ను, 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    సర్దార్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

    సర్దార్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

    సర్దార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 95 లక్షలు షేర్, ఇండియా వైడ్‌గా 3.7 కోట్ల షేర్, ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల షేర్ నమోదు చేసింది. తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 7 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది.

    English summary
    Versatile Actor Karthi's latest movie Sardar has released in Theatres on Octorber 21st. Raashi Khanna, Laila, Rajisha Vijayan are in lead roles. Here is the Day 1 worldwide collecitons reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X