twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోటాపోటీగా మహేష్, బన్నీ.. ఎంత కొల్లగొట్టారంటే..?

    |

    సంక్రాంతి బరిలోకి దిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ వైపు సరిలేరు నీకెవ్వరు, మరో వైపు అల వైకుంఠపురములో పోటాపోటీగా దుమ్ములేపుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసినా.. ఎవరి పనిలో వారు బిజీగా గడుపుతున్నా.. వసూళ్ల మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. సరిలేరు రిలీజై 17రోజులవుతుండగా.. అల వైకుంఠపురములో విడుదలై 16 రోజులవుతున్నాయి. వీటి కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    దూసుకుపోతోన్న సరిలేరు..

    దూసుకుపోతోన్న సరిలేరు..

    మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే మహేష్ కెరీర్‌లో ఆల్ టైమ్ సూపర్ హిట్‌గా రికార్డులు క్రియేట్ చేసి.. బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 200కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. పదిహేడో రోజు ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం.

    పదిహేడో రోజూ ఆగని సరిలేరు..

    పదిహేడో రోజూ ఆగని సరిలేరు..

    నైజాంలో 42 లక్షలు, సీడెడ్‌లో పది లక్షలు, ఈస్ట్ ఐదు లక్షలు, వెస్ట్ నాలుగు లక్షలు, గుంటూరు మూడు లక్షలు, కృష్ణా 3.3లక్షలు, నెల్లూరు రెండు లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 82లక్షలు వసూళ్లు చేసింది. పదిహేడో రోజు కూడా ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తోందంటా.

    అల వైకుంఠపురములో దూకుడు..

    అల వైకుంఠపురములో దూకుడు..

    మాటల మాంత్రికుడి మాయాజాలం, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్‌తో అల వైకుంఠపురములో చిత్రానికి రిపీటెడ్ ఆడియెన్స్ పెరుగుతున్నారు. దీంతో ఈ సినిమా వసూళ్లలో తగ్గుదలనేది కనిపించడమే లేదు. పదహారో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

    పదహారో రోజు ఆగని జోరు..

    పదహారో రోజు ఆగని జోరు..

    పదహారో రోజూ అల వైకుంఠపురములో ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో ఓ సారి చూద్దాం.. నైజాంలో 84లక్షలు, సీడెడ్‌లో 17లక్షలు, ఉత్తరాంధ్రలో 22లక్షలు, ఈస్ట్ 13లక్షలు, వెస్ట్ పది లక్షలు, గుంటూరు 9లక్షలు, కృష్ణా 8లక్షలు, నెల్లూరు ఆరు లక్షలు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1.69కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది.

    English summary
    Sarileru Neekevvaru Day 17 Collections And Ala Vaikunthapurramuloo 16th day Collections. According To Trade Reports Sariler Collected On 17th Day Is 0.82crores And Ala vaikunthapurramuloo On 16th Day Is 1.69 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X