Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు: ఏరియావైస్ డీటైల్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్
వరుస హిట్ సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో సత్తా చాటుతోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు రెండో రోజు ముగిసేసరికి కలెక్షన్ రిపోర్ట్ ఇలా ఉంది.

ఫామ్‌లో ఉన్న మహేష్.. చెప్పిందే చేశాడు
సరిలేరు నీకెవ్వరు టీజర్ ద్వారానే ప్రతీ సంక్రాంతికి అల్లుడొస్తాడు.. కానీ సంక్రాంతికి మొగుడొస్తున్నాడు అని చెప్పేశారు మహేష్. విడుదల తర్వాత ఈ సినిమా కలెక్షన్ల సునామీ చూస్తుంటే మహేష్ చెప్పింది అక్షరాలా నిజం అని నిరూపితమైంది. తొలిరోజే బాక్సాఫీస్ దాడి ప్రారంభించిన మహేష్.. రెండో రోజూ అదే ఫామ్ కొనసాగించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజే..
నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా 'సరిలేరు నీకెవ్వరు'తో థియేటర్స్‌లో బొమ్మ దద్దరిల్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
దీంతో కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇస్తూ తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 32.77 కోట్లు కొల్లగొట్టారు మహేష్ బాబు.

కంటిన్యూ.. కంటిన్యూ అన్నట్లుగా అదే జోష్
రెండో రోజు 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలైనప్పటికీ కంటిన్యూ.. కంటిన్యూ అన్నట్లుగా అదే జోష్ చూపించారు మహేష్. రెండో రోజు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాకు గాను 42.20 షేర్ వసూలైంది. 63 కోట్ల గ్రాస్ వచ్చింది.

ఏరియావైజ్ రిపోర్ట్.. ఎక్కడెక్కడ ఎంతెంత?
రెండో రోజు ముగిశాక.. నైజాంలో 12.68 కోట్లు, సీడెడ్‌లో 5.60 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 4.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో 3.15 కోట్లు, గుంటూరులో 5.65 కోట్లు, కృష్ణాలో 3.76 కోట్లు, నెల్లూరులో 1.55 కోట్లు వసూలు చేసింది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. మొత్తంగా చూస్తే 42.20 కోట్లు కలెక్ట్ అయింది.

ప్రీ రిలీజ్ బిజినెస్.. మేజర్ రికవరీ
నైజాంలో 26 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 6 కోట్లు, గుంటూరు 7.3 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3.1 కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 77.9 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ రెండు రోజుల్లో మేజర్ రికవరీ జరిగిందని చెప్పుకోవచ్చు.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.