Sarkaru Vaari Paata day 2 collections నైజాంలో దారుణంగా వసూళ్లు.. 100 కోట్లపై గురిపెట్టిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట అందరి అంచనాలను మించి భారీ వసూళ్లను తొలి రోజు నమోదు చేసింది. అదే జోష్‌తో రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్ అండతో నిలకడగా రెండో రోజు కలెక్షన్లను రాబట్టింది. అయితే తొలి రోజు వసూళ్ల కంటే తక్కువగానే నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రెండో రోజు డ్రాప్ భారీగా ఉండటంతో ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందనే విషయం ఆసక్తిగా మారింది. రెండో రోజు కలెక్షన్ల అంచనాల్లో వెళితే..

హైదరాబాద్‌లో 55 శాతం అక్యుపెన్సీ
హైదరాబాద్‌లో సర్కారు వారీ పాట చిత్రం అక్యుపెన్సీ సగానికి సగం పడిపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. శుక్రవారం 55 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదు అయింది. హైదరాబాద్‌లో మొత్తం 400 షోలు ప్రదర్శిస్తున్నారు. రెండో రోజున మొత్తంగా 35 లక్షలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

నైజాంలో కనిపించని జోష్
నైజాంలో సర్కారు వారీ పాట సినిమా కలెక్షన్ల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో రోజు మధ్యాహ్నం ఆట వరకు బుకింగ్స్ డల్‌గానే ఉన్నాయి. తొలి రోజున 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే రెండో రోజున 2 నుంచి 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది.

ఆంధ్రాలో డీసెంట్ కలెక్షన్లు
అయితే నైజాంలో కంటే.. ఆంధ్రాలో సర్కారు వారీ పాట కలెక్షన్లు డిసెంట్‌గా కనిపిస్తున్నాయి. రెండో రోజు కూడా అభిమానుల్లో జోష్ భారీగానే కనిపించింది. మధ్యాహ్నం ఆట వరకు ఒకే అనిపించేలా కలెక్షన్లు నమోదయ్యాయి. అయితే ఫస్ట్, సెకండ్ షోలు ఊపందుకొంటే.. కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. తొలి రోజున ఆంధ్రాలో 24 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజున 12 నుంచి 15 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

11వ సారి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో మహేష్
అమెరికాలో సర్కారు వారీ పాట కలెక్షన్ల ప్రవాహం రెండో రోజు కూడా మంచిగానే కనిపిస్తున్నాయి. మహేష్ బాబు వరుసగా 11వ సారి 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం విశేషం. తొలి రోజున దాదాపు 1.25 మిలియన్ డాలర్లను రాబట్టింది. అయితే రెండో రోజున మరో 500k వసూళ్లను రాబట్టే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో ఈ చిత్రం రెండో రోజు నాటికి 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

రెండో రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
సర్కారు వారీ పాట రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. రెండో రోజున సుమారు 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా?
సర్కారు వారీ పాట చిత్రం విడుదలకు ముందు 120 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 121 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే 45 కోట్ల షేర్ సంపాదించింది. పరిస్థితి బాగుంటే వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











