సునీల్ కు కథ ఇవ్వటమే కాకుండా.. సాయింగా వస్తున్న బన్నీ
హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘సరైనోడు' ఫస్ట్ లుక్ టీజర్ ..ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమచారం ప్రకారం ఇది 38 సెకన్లు ఉండబోతోంది. ఈ టీజర్ ని సునీల్ తాజా చిత్రం ‘కృష్ణాష్టమి'కి జత చేయనున్నట్లు సమాచారం.
మొదట అల్లు అర్జున్ కు అనుకున్న కథ..‘కృష్ణాష్టమి'అని నిర్మాత చెప్తున్న సంగతి తెలిసిందే. బన్నీ డేట్స్ ఖాళీ లేకపోవటంతో సునీల్ తో ఈ సినిమాని చేస్తున్నారు. అంటే సునీల్ కు కథ ఇచ్చి, టీజర్ రూపంలో బన్నీ తోడు వస్తున్నాడన్నమాట.
Also Read: హిట్ కొడతాడా?: సునీల్ 'కృష్ణాష్టమి' ఇన్ సైడ్ టాక్

సునీల్ ‘కృష్ణాష్టమి' ఈ శుక్రవారం భాక్సాఫీస్ ని పలకరించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి ధియోటర్స్ లో భారీగా విడుదల అవుతోంది. దాంతో తప్పకుండా ఈ టీజర్ ఎక్కువ మందిని చేరుతుందని భావించే ఇలా సెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ టీజర్ పూర్తిగా అల్లు అర్జున్ ..యాక్షన్ హీరోగా చూపిస్తూ సాగనుంది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ పాత్రలు చేస్తూ పూర్తి స్ధాయి యాక్షన్ కు దూరంగా ఉన్నాడు. అందుకనేమో ..బోయపాటి ఈ సారి ఇలా యాక్షన్ ని మెయిన్ టార్గెట్ చేసి రెడీ చేస్తున్నాడు.
ప్రస్తుతం అంజలి, అల్లు అర్జున్ పై సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పాట కూడా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని చెప్తున్నారు. ఇలా ఈ సినిమాపై అంచనాలు పెంచే అంశాలు చాలా ఇనక్లూడ్ చేసారు.


Click it and Unblock the Notifications











