twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jersey 3 days collections.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా.. కేజీఎఫ్2 దెబ్బకు విలవిల

    |

    బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ మూవీ దారుణమైన పరిస్థితిని బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొంటున్నది. గతంలో తన సినిమాలతో వంద కోట్లు ఆర్జించిన షాహిద్.. ప్రస్తుతం రెండెంకలతో కూడిన కలెక్షన్లను సాధించడానికి ముప్పుతిప్పలు పడుతున్నది. జెర్సీ సినిమాకు పేలవమైన కలెక్షన్లు సంపాదించడానికి కారణం KGF Chapter 2 చిత్రం ప్రభంజనం కొనసాగడమే..

    అర్జున్ రెడ్డి రీమేక్‌కు 100 కోట్లు

    అర్జున్ రెడ్డి రీమేక్‌కు 100 కోట్లు


    కరోనా వైరస్ లాక్‌డౌన్‌కు ముందు షాహిద్ కపూర్ కబీర్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కియారా అద్వానీతో కలిసి నటించినఈ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డికి రీమేక్. ఇక తాజా జెర్సీ చిత్రం నాని, దర్శకుడు గౌతమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రానికి రీమేక్ కావడం తెలిసిందే. అయితే ఈ సారి ఈ ఎమోషనల్ డ్రామా భారీగా రివ్యూలు సాధించినప్పటికి.. కాసుల పంటను పండించలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    పలు మార్లు వాయిదాతో

    పలు మార్లు వాయిదాతో


    జెర్సీ చిత్రం విడుదల విషయంలో తర్జనభర్జన పడింది. ఓసారి RRR మూవీ కారణంగా, మరోసారి కేజీఎఫ్2 కారణంగా విడుదల వాయిదా పడింది. మొత్తం ఈ సినిమా సుమారు 5 సార్లు రిలీజ్ డేట్ మార్చుకొని చివరకు ఏప్రిల్ ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

    RRR, మరాఠీ చిత్రం కారణంగా

    RRR, మరాఠీ చిత్రం కారణంగా


    జెర్సీ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 22 నుంచి 25 కోట్లు వసూలు చేస్తుందని ఆశించారు. కానీ RRR, అదే రోజు విడుదలైన మరాఠీ చిత్రానికి మంచి టాక్ ఉండటంతో జెర్సీ కలెక్షన్లు సైడ్ ట్రాక్ పట్టాయి

    కేజీఎఫ్2 ప్రభంజనంతో

    కేజీఎఫ్2 ప్రభంజనంతో


    అయితే జెర్సీ భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోవడానికి KGF Chapter 2 మూవీపై ప్రేక్షకులు సూపర్ క్రేజ్ ఉండటమే.. ఈ చిత్రం ఆదివారం 20 కోట్లు, రెండో వారాంతంలో ఏకంగా 50 కోట్లు రాబట్టడంతో జెర్సీ వసూళ్లపై భారీ ప్రభావం పడింది. దాంతో జెర్సీకి టాక్ బాగానే ఉన్న కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో ఈ సినిమాకు అంతగా ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడంతో భారీ కలెక్షన్లు నమోదు చేయలేకపోతున్నది.

    మూడు రోజుల కలెక్షన్లు ఇలా..

    మూడు రోజుల కలెక్షన్లు ఇలా..


    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ చిత్రం తొలి రోజున 3.75 కోట్లు, శనివారం 5 కోట్లు, ఆదివారం 5.15 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం 14 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అయితే షాహిద్ కపూర్ సినిమాకు రావల్సిన రేంజ్ కలెక్షన్లు కాకపోవడం గమనార్హం అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. son.

    English summary
    Shahid Kapoor’s Jersey movie has come with high expectations. It collected 14 crores in three days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X