twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్ఏలోనూ అదరగొడుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’

    |

    నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శైలజా రెడ్డి అల్లుడు' బాక్సాపీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. తొలి రోజు వసూళ్లు నాగ చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటికంటే ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మొత్తం రూ. 12 కోట్ల గ్రాస్ తో పాటు దాదాపు 7 కోట్ల షేర్ రాబట్టింది.

    ఇక యూఎస్ఏలోనూ ఈ మూవీ మంచి ఫలితాలు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి $350K నుండి $400K వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం నాటికే యూఎస్ఏ కలెక్షన్ $209,294 మార్కును అందుకుంది.

    Shailaja Reddy Alludu USA collections

    యూఎస్ఏలో ఈ మూవీ 123 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. సినిమా టాక్ కూడా బావుండటంతో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం ఉందనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఫుల్ రన్‌లో ఈ మూవీ 1 మిలియన్ మార్కును అందుకుంటుందా? లేదా? అనేది వేయి చూడాలి.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో శైలజారెడ్డి అల్లుడు తొలి రోజు 5.7 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం ఏరియాలో అత్యధికంగా 220 స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కావడంతో తెలంగాణ రాష్ట్రంలో శైలజ రెడ్డి అల్లుడు తొలిరోజు 1.71 కోట్ల షేర్ రాబట్టింది.

    మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ, నాగ వంశీ ఎస్, పిడివి ప్రసాద్ నిర్మించారు. రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించగా నాగ చైతన్య కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.

    English summary
    Shailaja Reddy Alludu has opened to brilliant response and made superb collection at the US box office. The film all set to amass anywhere between $350K to $400K in its first weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X