»   » వర్కౌట్ కాదు, పవన్ కళ్యాణ్ నిర్మాత డిమాండ్ చాలా ఓవర్‌!

వర్కౌట్ కాదు, పవన్ కళ్యాణ్ నిర్మాత డిమాండ్ చాలా ఓవర్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు పలు టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారికి ఈ రైట్స్ దక్కే అవకాశం ఉంది.

200% టేబుల్ ప్రాఫిట్: సర్దార్లో...పవన్ వాటా ఎన్నికోట్లు?


అయితే ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ రేటు కాస్త ఓవర్ గా చెబుతుండటంతో ఈ డీల్ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదట. ఇప్పటి వరు తెలుగు సినిమా పరిశ్రమలో హయ్యెస్ట్ శాటిలైట్ రైట్స్ దక్కింది బాహుబలి సినిమాకు మాత్రమే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఒక్కో పార్టుకు రూ. 14.5 కోట్ల చొప్పున వచ్చాయి.


సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)


Sharat Marrar quoting Rs 15 Cr for SGS satellite rights

పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ హైరేంజిలో ఉంది కాబట్టి....అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడట నిర్మాత. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి రూ. 15 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే ఇంత రేటు అంటే వర్కౌట్ కాదని టీవీ ఛానల్ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు సమాచారం.


ప్రస్తుతం నిర్మాత, టీవీ ఛానల్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రూ. 13 కోట్ల వద్ద డీల్ ఓకే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 13 కోట్ల రేటు వచ్చినా రికార్డే. బాహుబలి సినిమాను పక్కన పెడితే ఇప్పటి వరకు ఏ సినిమాకు రూ. 12 కోట్లకు మించి శాటిలైట్ రైట్స్ రాలేదు.

English summary
The producers of Pawan Kalyan's "Sardaar Gabbar Singh" are expecting more amount than the "Baahubali". Sharat Marrar is reportedly quoting Rs 15 Cr for the satellite rights of the movie but no TV channel is coming forward to pay such an exorbitant price. Buzz in the industry is that Gemini TV which is lagging behind in TRP ratings is in negotiations with Sharat Marrar to buy the movie for Rs 13 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu