»   »  ఆ రెండు పెద్ద సినిమాల మధ్య దిల్ రాజు ‘శతమానం భవతి’ పరిస్థితి ఇదీ...!

ఆ రెండు పెద్ద సినిమాల మధ్య దిల్ రాజు ‘శతమానం భవతి’ పరిస్థితి ఇదీ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో, నటసింహం బాలయ్య తన 100వ సినిమాతో బాక్సాఫీసు రేసులో దూకడంతో వీరిద్దరితో పోటీ పడలేని చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం పోటీకి బయ పడకుండా... సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో తాను నిర్మించిన 'శతమానం భవతి' ఈ నెల 14న విడుదల చేసారు.

పోటీ ఉన్నప్పటికీ తన సినిమాకు ఆశించిన రిజల్ట్ వస్తుందని ధైర్యంగా ముందడుగు వేసిన దిల్ రాజు నమ్మకం నిలబడింది. సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. కాక పోతే ఖైదీ, శాతకర్ణి సినిమాలకు సంభించినన్ని థియేటర్లు దొరకలేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (శని, ఆది) ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాలన్నింటిలో కలిపి రూ. 5.74 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

 ఓపెనింగ్స్ అదిరాయి

ఓపెనింగ్స్ అదిరాయి

సినిమా విడుదలైన తొలి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. పండగరోజు విడుదల కావడంతో రూ. 3.03 కోట్లు వసూలు చేసింది. ఆదివారం రూ. 2.71 కోట్లు వసూలు చేసింది.

 ఓవర్సీస్ లో కూడా

ఓవర్సీస్ లో కూడా

ఓవర్సీస్ ఏరియాలో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారం వరకు $380,612 గ్రాస్ వసూలు చేసింది.

 నైజాంలో

నైజాంలో

నైజాం ఏరియాలో ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 1.98 కోట్లు వసూలు చేసింది. శర్వానంద్ సినిమాకు ఈ రేంజి వసూళ్లు రావడం అంటే గొప్పగానే చెప్పుకుంటున్నారు ట్రేడ్ వర్గాల్లో.

 ఆంధ్రా, సీడెడ్

ఆంధ్రా, సీడెడ్

ఇక సీడెడ్ ఏరియాలో రూ. 67 లక్షలు, నెల్లూరు. 15.6 లక్షలు, గుంటూరు 47 లక్షలు, కృష్ణ రూ. 33.63 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 53.06 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 70.61 లక్షలు వసూలు చేసింది.

English summary
In its first weekend, Shatamanam Bhavathi collected a share of 5.74 crores in Andhra, Ceded and Nizam areas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu