»   » టాలీవుడ్ అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి సినీ సంక్రాంతి సందడి అంతా మెగాస్టార్ 150వ చిత్రం 'ఖైదీ నెం 150', బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాల చుట్టే తిరిగింది. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతూ అండర్ డాగ్ లాగా బరిలోకి దిగిన 'శతమానం భవతి' చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకెలుతోంది.

ట్రేడ్ పండితులంతా అసలు సిసలైన సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ నటించిన 'ఖైదీ నెం 150' కాదు, బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా కాదు..... దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్-అనుపమ పరవేశ్వరన్ జంటగా తెరకెక్కిన 'శతమానం భవతి' చిత్రమే అంటున్నారు.

కేవలం సంక్రాంతి విన్నర్ అనే పేరు సంపాదించుకోవడం మాత్రమే కాదు... చిన్న బడ్జెట్ చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా బాక్సాఫీసు వద్ద విజయంతంగా 2 వారాల దిశగా దూసుకెలుతోంది.

 13 రోజుల్లో

13 రోజుల్లో

13వ రోజు(గురువారం) వరకు అందిన వివారాల ప్రకారం ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 22 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే యూఎస్ఏలో ఈ చిత్రం దాదాపు $700K వసూలు చేసింది.

 ఫుల్ రన్ లో రూ. 30 కోట్లు

ఫుల్ రన్ లో రూ. 30 కోట్లు

తెలుగు రాష్ట్రాలు, యూఎస్ఏ, రెస్టాఫ్ వరల్డ్, రెస్టాప్ ఇండియా కలిపి ఈ చిత్రం దాదాపు 25 కోట్ల పైనే షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈచిత్రం రూ. 30 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

 ఏరియా వైజ్ షేర్

ఏరియా వైజ్ షేర్

శతమానం భవతి చిత్రం వివిధ ఏరియాల్లో 13 రోజుల్లో వసూలు చేసిన షేర్ వివరాల్లోకి వెళితే...నైజాంలో రూ. 8.06 కోట్లు, సీడెడ్ లో రూ. 2.23 కోట్లు, నెల్లూరులో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 1.46 కోట్లు, కృష్ణలో రూ. 1.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.08 కోట్లు వసూలు చేసింది.

 ఆశ్చర్య పరిచే వసూల్లు

ఆశ్చర్య పరిచే వసూల్లు

ఒక చిన్న సినిమాగా వచ్చి... రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ఇలాంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించడం విశేషం. సినిమాలో ఫ్యామిలీ కంటెంట్ ఉండటంతో రిలీజ్ విషయంలో నిర్మాత దిల్ రాజు స్ట్రాటజీ కూడా సినిమా సంక్రాంతి బరిలో విన్ అవ్వడానికి దోహదం చేసాయని అంటున్నారు.

English summary
Dil Raju's Shatamanam Bhavati surprising the entire film industry. The movie not just won the Sankranthi winner crown but has also emerged as one of the highest grossers among low-medium budget films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu