»   »  శివాజీ 175!

శివాజీ 175!

Posted By:
Subscribe to Filmibeat Telugu


శివాజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 135 థియేటర్లలో ఇంకా ప్రదర్శింపబడుతోంది. ఒక తమిళనాడులోనే 100 థియేటర్లలో 100 రోజులను పూర్తిచేసుకుంది. 100 రోజుల ఫంక్షన్ ను ఎలాంటి హంగులేకుండా చాలా సాధారణంగా జరిపారు. ఇలా ఎందుకు చేశారంటే ఎవిఎమ్ సంస్థ చక్కని సమాధానం చెప్పింది. 175 రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామని బదులిచ్చారు. ఎవిఎమ్ సంస్థ ఎన్నో సినిమాలను నిర్మించినప్పటికీ శివాజీ సినిమాకు అధిక బడ్జెట్ ను వెచ్చించి భారతీయ సినిమా చరిత్రలో కొత్త పేజీని లిఖించింది. ఇదిలా ఉంటే ఈ వారాంతంలో ఈ సినిమా 175 రోజులను పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించే ఫంక్షన్ లో ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఎవిఎమ్ సన్మానించనున్నట్టు తెలుస్తోంది.

ఇంకో విషయం ఏమంటే శివాజీ సినిమాను వినూత్న రీతిలో వీక్షించేందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రణాళికను సిద్ధం చేసింది. గాలిలో తేలిపోతూ ఈ సినిమాను చూసే అవకాశాన్ని రూపొందించింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ ఎక్కితే అక్కడ మనకు ఈ సినిమాను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇలా ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ హక్కులు కొన్నది. దీనికి కోసం బాగానే వెచ్చించిందిట. ఇలా సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక భారతీయ సినిమాను కొనడం ఇదే మొదలుట. డిసెంబర్ 1 నుంచి ఈ సినిమాను సింగపూర్ ఎయిర్ లైన్స్ అన్ని విమానాలలో ఈ సినిమాను వీక్షించవచ్చట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X