twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Price Day 2 Collections: కొనసాగుతోన్న శివ కార్తికేయన్ హవా.. ప్రిన్స్ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్ కేవీ. ఇక కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నిలిచాడు శివ కార్తికేయన్. వీరిద్దరి కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ప్రిన్స్. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాల నడుమ అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదలైంది ప్రిన్స్. మరి ఈ మూవీ రెండో కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

     రూ. 60 కోట్ల బడ్టెట్..

    రూ. 60 కోట్ల బడ్టెట్..

    కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన గత చివరి రెండు చిత్రాలైన కాలేజ్ డాన్, డాక్టర్ వరుణ్ బాక్సాఫీస్ వద్ద వేగంగా రూ. 100 కోట్లు రాబట్టాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వచ్చిన మూడో చిత్రం ప్రిన్స్ పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రిన్స్ మూవీకి రూ. 60 కోట్ల బడ్టెట్ అయినట్లు సమాచారం.

     ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    లవ్ అండ్ ఫన్ కాన్సెప్టుతో వచ్చిన ప్రిన్స్ మూవీ తమిళంలో రూ. 32 కోట్ల వరకు బిజినెస్ చేయగా 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ వసూళు చేసింది. ఇక కర్ణాటకలో రూ. 2.5 కోట్లు, కేరళలో రూ. 1.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి వరకు బిజినెస్ చేసిన ప్రిన్స్.. ఓవర్సీస్ మొత్తంలో కూడా రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రిన్ మూవీ రూ. 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

     ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్లలో..

    ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్లలో..

    ఇక ప్రిన్స్ సినిమా స్క్రీన్ల వివరాల్లోకి వెళితే.. శివకార్తీకేయన్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా ప్రిన్స్ రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడులో 600 స్క్రీన్లలో విడుదలైంది. ఆంధ్రా, నైజాంలో 290 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్లలో రిలీజైంది. అమెరికాలో 157 లోకేషన్లలో రిలీజైంది.

    రెండో రోజు ఆక్యుపెన్సీ..

    రెండో రోజు ఆక్యుపెన్సీ..

    ప్రిన్స్ సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. చెన్నైలో 44 శాతం, కోయంబత్తూరులో 34.75, పాండిచ్చేరిలో 56 శాతం, సాలెం 31, దిండిగల్ 33.25 శాతం, త్రిచూరులో 57.25 శాతం అక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో హైదరాబాద్‌లో 25.25 శాతం, గుంటూరులో 29.25 శాతం, వైజాగ్‌లో 26 శాతం, కాకినాడలో 99 శాతం, నెల్లూరులో 33.33 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

     రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో..

    రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో..

    శివ కార్తికేయన్, అనుదీప్ కేవీ కాంబినేషన్ సినిమా ప్రిన్స్ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 46 లక్షలు వసూలు చేసింది. ఇక రెండు రోజులకు కలిపి నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్ లో రూ. 15 లక్షలు, ఆంధ్రాలో రూ. 65 లక్షలు మొత్తంగా రూ. 1.36 కోట్ల షేర్, రూ. 2.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లు అయింది. ఇంకా రూ. 5.64 కోట్లు రావాల్సి ఉంది.

    దేశవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

    దేశవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

    ఉక్రేయిన్ ముద్దుగుమ్మ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించిన ఈ ప్రిన్స మూవీకి దేశవ్యాప్తంగా రెండో రోజు రూ. 5.75 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక రెండు రోజులకు కలుపుకుని మొత్తంగా రూ. 12 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది.

    English summary
    Kollywood Star Hero Sivakarthikeyan And Tollywood Director Anudeep KV Combination Movie Prince 2nd Day Box Office Collection Is Approximately Rs 12 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X