»   »  ‘సోగ్గాడు’ కూడా 50 కోట్ల షేర్ సాధించాడు

‘సోగ్గాడు’ కూడా 50 కోట్ల షేర్ సాధించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీసు రారాజు నాగార్జునే అని తేలి పోయింది. ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయానా' మాత్రమే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కంటే ఎక్కువ షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

ఈ రివ్యూల పరంగా, మౌత్ టాక్ పరంగా ఎక్కువ రేటింగ్ వచ్చింది ఈ సినిమాకే. ఈ చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా నాగార్జునే. చాలా ఏరియాల్లో ఆయనే సొంతగా రిలీజ్ చేసుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ చిత్రం లాభాలు గడించింది.


ఇతర సినిమాలతో పోలిస్తే ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. విడుదలైన అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించడం విశేషం.


Soggade Chinni Nayana crosses 50 cr club

టాలీవుడ్లో 50 కోట్ల షేర్ సాధించడం అంటే మాటలు కాదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఈ తరం హీరోలకు మాత్రమే ఇది సాధ్యమనే లెక్కలు నిన్నటి వరకు ఉండేవి. గతేడాది బాహుబలితో ప్రభాస్, ఇటీవల ఎన్టీఆర్ కూడా ‘నాన్నకు ప్రేమతో' చిత్రంతో 50 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోలు ఈ ఫీట్ అందుకుంటారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఆ ఊహ నిజం కాదు...అని నిరూపించాడు నాగార్జున.


ప్రస్తుతం నాగార్జున ‘ఊపిరి' చిత్రం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీ, తమన్నా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనుష్క, శ్రేయ, అడవి శేష్ కీలక పాత్రల్లో కనపడనున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్‌గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Soggade Chinni Nayana crosses 50 cr club. All over results are with so much profit and movie is biggest blockbuster for akkkineni and Annapurna studioes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu