»   » అక్షయ్‌కుమార్‌కు షాకిచ్చిన స్వీటీ..

అక్షయ్‌కుమార్‌కు షాకిచ్చిన స్వీటీ..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినీ పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని చిత్రాలు ఆశ్చర్యకరమైన రీతిలో విజయాలు సాధిస్తుంటాయి. బాలీవుడ్‌లో తాజాగా రిలీజైన సోను కే టిటూ కీ స్వీటీ అనే చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్‌ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను సాధిస్తున్నది.

   ప్యాడ్‌మ్యాన్ సినిమా కంటే

  ప్యాడ్‌మ్యాన్ సినిమా కంటే

  సోను కే టిటూ కీ స్వీటీ చిత్రంలో నూతన నటీనటులు కార్తీక్ ఆర్యన్, నుష్త్రత్ బరుచా, సన్నీ సింగ్ తదితరులు నటించారు. ఈ చిత్రం అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ చిత్రం కంటే మించి వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

   వసూళ్ల పరుగు

  వసూళ్ల పరుగు

  సోను కే టిటూ కీ స్వీటీ చిత్రం 2018లో రిలీజైన పద్మావతిని మినహాయించి మిగితా చిత్రాల కంటే ఎక్కువగా కలెక్షన్లను సాధించింది. అజయ్ దేవగన్ నటించిన రైడ్ శుక్రవారం రిలీజయ్యే వరకు ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండదు అనే మాట వినిపిస్తున్నది.

   రూ.82.10 కోట్ల వసూళ్లు

  రూ.82.10 కోట్ల వసూళ్లు

  2018‌లో సోను కే టిటూ కీ స్వీటీ చిత్రం భారీగా వసూలు చేసిన రెండో అతిపెద్ద చిత్రంగా రూపొందింది. అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్‌మ్యాన్ చిత్రం రూ.81 కోట్లు వసూలు చేసింది. కాగా సోనూ కే టిటూ రూ.82.10 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం 4.12 కోట్ల వసూళ్లను రాబట్టింది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

   మరిన్నీ చిన్న చిత్రాలు

  మరిన్నీ చిన్న చిత్రాలు

  సోను కే టిటూ కీ స్వీటీ అందించిన విజయంతో లవ్ రంజన్‌తో కలిసి మరిన్నీ చిత్రాలు నిర్మించేందుకు టీ సిరీస్ ప్లాన్ చేస్తున్నది. విభిన్నకథాంశంతో మరిన్నీ చిన్న బడ్జెట్ సినిమాలను తీస్తామని వారు పేర్కొన్నారు.

  English summary
  The makers of 'Sonu Ke Titu Ki Sweety' are overjoyed with the spectacular success of the film. The Luv Ranjan directed romantic comedy which was a non-holiday release and has lesser known names in its cast, proved to be a successful affair at the box-office. According to noted trade analyst Taran Adarsh, the Kartik Aaryan-Nushrat Bharucha-Sunny Singh starrer comedy film earned Rs 82.10 crore net by the end of its third weekend. The film has surpassed the lifetime collection of Akshay Kumar's social drama 'Pad Man'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more