»   » రూ. 150 కోట్లు వసూలు చేసిన ‘స్పైడర్’.... కేవలం మహేష్ బాబు వల్లే!

రూ. 150 కోట్లు వసూలు చేసిన ‘స్పైడర్’.... కేవలం మహేష్ బాబు వల్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా భారీ నెంబర్స్ నమోదు చేస్తోంది. ఈ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 150 కోట్లను క్రాస్ అయినట్లు నిర్మాత ఠాగూర్ మధు అఫీషియల్‌గా ప్రకటించారు.

బాక్సాఫీసు వద్ద 12 రోజుల్లో ఈ చిత్రం ఇంత పెద్ద భారీ మొత్తం వసూలు చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేయడం ఆనందంగా ఉందని, ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు ప్రకటించారు.


మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్

మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్

స్పైడర్ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన చిత్రం కూడా ఇదే.


మొదటి రోజు సంచలనం

మొదటి రోజు సంచలనం

'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.2 రోజుల్లో 72 కోట్లు

2 రోజుల్లో 72 కోట్లు

సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 72 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును అందుకుంది. సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.... మహేష్ బాబు సినిమాలపై ఫ్యామిలీ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తే ఇంత భారీ కలెక్షన్ రావడానికి కారణమైంది.


ఓవర్సీస్ ప్రీమియర్స్

ఓవర్సీస్ ప్రీమియర్స్

‘స్పైడర్' మూవీ ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.కేవలం మహేష్ బాబు వల్లే...

కేవలం మహేష్ బాబు వల్లే...

సినిమా రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి కారణం కేవలం మహేష్ బాబే అని అంటున్నారు. ఆయనకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఫైనల్‌గా మిగిలేది లాభమా? నష్టమా?

ఫైనల్‌గా మిగిలేది లాభమా? నష్టమా?

రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినప్పటికీ.... సినిమా డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి వచ్చే పరిస్థితుల్లో మాత్రం లేదని అంటున్నారు. అందుకు కారణం సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు చేయడమే అని టాక్.


English summary
Superstar Mahesh Babu's Spyder had a record-breaking opening and raked in Rs 51 crore on its first day. Spyder is said to have collected Rs 150 crore on its 12th day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu