»   » టెర్రిఫిక్: మహేష్ బాబు ‘స్పైడర్’ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 156 కోట్లు!

టెర్రిఫిక్: మహేష్ బాబు ‘స్పైడర్’ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 156 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu "Spyder" Worldwide Theatrical Business

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రానికి డిమాండ్ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ ముందు టెర్రిఫిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం ది బెస్ట్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

మహేష్ గత చిత్రం 'బ్రహ్మోత్సవం' బాక్సాఫీసు వద్ద నష్టాలను మిగిల్చినా...ఆ ప్రభావం ఏమాత్రం కూడా 'స్పైడర్' బిజినెస్ మీద పడలేదు. 'స్పైడర్' కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీగా ఇన్వెస్ట్ చేసి ఆయా ఏరియాల్లో కొనుగోళ్లు జరిపారు.

తమిళ వెర్షన్ వల్ల అదనపు లాభం

తమిళ వెర్షన్ వల్ల అదనపు లాభం

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయడం వల్ల లాభాలు అదనంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మురగదాస్‌కు తమిళంలో మంచి సక్సెస్ రేటు ఉండటంతో అక్కడ సినిమా మంచి రేటుకు అమ్ముడు పోయింది.


మలయాళంలో కూడా

మలయాళంలో కూడా

ఈ సినిమాను తొలుత తెలుగు, హిందీ, తమిళం అనుకున్నారు. కానీ హిందీ రిలీజ్ ప్లాన్స్ విరమించుకున్నారు. మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీని వల్ల కూడా ఎంతో కొంత రెవెన్యూ రావడం ఖాయం.


నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో ‘స్పైడర్' సినిమా రైట్స్ రూ. 23 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. మహేష్ బాబు సినిమాకు ఇక్కడ ఇంత రేటు రావడం ఇదే తొలిసారి.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో కూడా ‘స్పైడర్' చిత్రానికి భారీ రేటు వచ్చింది. ఈ చిత్రం ఇక్కడ ఏకంగా రూ. 12 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ ఏరియాలో ప్రిన్స్ సినిమాలకు ఇదే హయ్యెస్ట్ బిజినెస్.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో ‘స్పైడర్' మూవీ రూ. 8.1 కోట్లకు అమ్ముడు పోయింది. మహేష్ బాబు సినిమా ఇంత భారీ మొత్తానికి ఈ ఏరియాలో అమ్ముడు పోవడం ఇదే తొలిసారి.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో మహేష్ బాబు ‘స్పైడర్' చిత్రానికి రూ. 7.2 కోట్ల బిజినెస్ జరిగింది. అక్కడ మహేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఉండటం వల్లనే ఇంత రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో ‘స్పైడర్' బిజినెస్ ఈ సారి భారీగానే జరిగింది. ఈ చిత్రాన్ని స్థానిక డిస్ట్రిబ్యూటర్ రూ. 5.4 కోట్లకు కోనుగోలు చేశాడట.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో ‘స్పైడర్' చిత్రం రూ. 6 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో రూ. 5.04 కోట్ల ఈ సినిమా అమ్ముడు పోయినట్లు సమాచారం.


నెల్లూరు ఏరియా

నెల్లూరు ఏరియా

నెల్లూరు ఏరియాలో ఈ చిత్రాన్ని రూ. 2.9 కోట్లకు అమ్మారు.


ఏపీ తెలంగాణ

ఏపీ తెలంగాణ

ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ. 69.6 కోట్ల బిజినెస్ జరిగింది.


తమిళనాడు

తమిళనాడు

తమిళనాడులో ‘స్పైడర్' చిత్రానికి రూ. 17 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మురుగదాస్‌కు తమిళనాడులో మంచి సక్సెస్ రేటు ఉండటంతో ఇంత రేటు వచ్చినట్లు తెలుస్తోంది.


కర్నాటకలో....

కర్నాటకలో....

కర్నాటకలో ఈ చిత్రం రూ. 10.8 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. మహేష్ బాబు సినిమాకు కర్నాటకలో ఇది భారీ మొత్తమే.


నార్త్ ఇండియా

నార్త్ ఇండియా

‘స్పైడర్' మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రూ. 1 కోటికి అమ్ముడయ్యాయి.


ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్ రైట్స్ ‘స్పైడర్' చిత్రానికి రూ. 23 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే ఇది భారీ మొత్తం.


ఇప్పటి వరకు మొత్తం బిజినెస్ 156.4 కోట్లు

ఇప్పటి వరకు మొత్తం బిజినెస్ 156.4 కోట్లు

థియేట్రికల్ రైట్స్ రూపంలో వరల్డ్ వైడ్ మొత్తం రూ. 121.4 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్, డిజిజిటల్ రైట్స్(రూ. 33 కోట్లు), ఆడియో రైట్స్ రూ. 2 కోట్లు..... మొత్తం కలిపి ఇప్పటి వరకు రూ.156.4 కోట్లు వచ్చినట్లు సమాచారం.English summary
Spyder Worldwide Theatrical Business: Rs 121.4 crore (includes Tamil Nadu: Rs 17 crore, Karnataka: Rs 10.8 crore, North India: Rs 1 crore, Overseas: Rs 23 crore). Spyder Pre-Release Business: Rs 156.4 crore (includes Satellite & Digital: Rs 33 crore, Audio: Rs 2 crore) .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu